ధర్మసాగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మాట్లాడుతూ.. ప్రజలందరూ కేసీఆర్ కు అండగా కడియం ను గెలిపిస్తే అందరినీ మోసం చేసిండని ఆయన మండిపడ్డారు. డబ్బులకు లొంగి , పదవుల పేరుతో బిఆర్ఎస్ కు , తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదకారిగా కడియం తయారయ్యాడని పల్లా వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో , మాదిగ పోరాట సమితి ఉద్యమంలో లేడు కానీ నేనే గొప్ప అని చెబుతూ అహంకారంతో అందరినీ మోసం చేస్తున్నాడని, వ్యక్తిగతంగా మాదిగలకు ఏం చేసిన వ్యక్తి కడియం కాదన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆనాడు ఎన్టీఆర్ కు , ఈరోజు కెసిఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కడియం శ్రీహరి అని, ప్రజలు చి కొడుతారు . నోట్లో ఉమ్మి వేసి , చెప్పులతో కొడతారన్నారు. ముసలి వయసులో , ముసలి నక్క లాగా మా ప్రాంత ప్రజలను మోసం చేసినవని, నీకు సిగ్గు శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ అని ఆయన డిమాండ్ చేశారు.
Bengaluru: బెంగళూర్‌లో దంచికొడుతున్న ఎండలు.. ఏడేళ్ల గరిష్టానికి ఉష్ణోగ్రతలు..
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేని లోటు నేను తీరుస్తానని, జనగాం తో పాటు , స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ లను రెండు కండ్ల లాగా కాపాడుకుంటానన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇక్కడ ఎమ్మెల్యే లేని లోటు తీరుస్తా.. కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుతానని అన్నారు.మీ మాయమాటలు, బెదిరింపులకు.. ఉడుత ఊపులకు ఎవరూ భయపడరన్నారు. వచ్చే ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో మాదిగ బిడ్డను గెలిపించుకుందామన్నారు. ఈ ప్రాంత బిడ్డగా మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండి పని చేస్తా అని అన్నారు పల్లా. కడియం శ్రీహరిని బీఆర్ఎస్ తరఫున నిలబడితే స్టేషన్ ఘనపూర్ ప్రజలు గెలిపిస్తే .. కుట్రపూరితంగా ఒక్కొక్కరిని పార్టీ నుంచి బయటకు పంపారని ఆరోపించారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.
INDIA Bloc: కేజ్రీవాల్ కోసం కూటమి భారీ ర్యాలీ.. ఈసీ గ్రీన్‌సిగ్నల్!