కవితను అరెస్టు చేయడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు.. తెచ్చుకున్న తెలంగాణకు న్యాయం చేయకుండా కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రం బాగుపడింది అని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. అందుకే వారి కుటుంబానికి తగిలే దెబ్బలు ప్రజలందరూ స్వీకరిస్తున్నారు. కవితను అరెస్టు చేయడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు అని తెలిపారు. అలాగే, కాళేశ్వరం, మేడిగడ్డ విషయంలో కూడా బీజేపీ ప్రభుత్వం మాట్లాడకుండా ఉంది అంటే ఆరోజు మెగా వాళ్ళు కోట్ల రూపాయలు ఇస్తున్నారన్నారు. ఇక, వరంగల్ నగరంలో గతంలో…
ఓటు హక్కును ఓటర్లకు తెలియజేసే ప్రయత్నంగా బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ‘నేను తప్పకుండా ఓటు వేస్తాను’ అనే థీమ్‌తో 5కే రన్ నిర్వహించారు. పాత కలెక్టరేట్ నుంచి 5కే రన్‌ను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మకరంద్ జెండా ఊపి ప్రారంభించారు. 5కే రన్ లో వివిధ శాఖల అధికారులు, డ్వాక్రా సంఘాల సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక సంస్థల సభ్యులు, యువతీ, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. TSRTC : ఉప్పల్‌లో SRH-MI…
వేసవి కాలం వచ్చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణంలో వచ్చిన మార్పులతో ప్రజల జీవన విధానం కూడా మారడం మొదలైంది. వేసవిలో మండే ఎండలు, తీవ్రమైన వేడిని నివారించడానికి, ప్రజలు తమ ఆహారం, దుస్తులలో మార్పులు చేసుకుంటారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటల దాడికి దిగారు. ధైర్యంగా తన పదవికి రాజీనామా చేసి మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో తనపై పోటీ చేస్తానని అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలోకి వెళ్లడం ఖాయమన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ, ముఖ్యమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ, మల్కాజిగిరి నుండి పోటీ చేయాలనే సవాలుకు రేవంత్ రెడ్డి స్పందించలేదని,…
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నాడియా జిల్లాలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలిక తన ఇంట్లోనే అత్యాచారానికి గురైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేత కొడుకు ఈ దారుణానికి పాల్పడినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, బీజేపీ ఆరోపణలను టీఎంసీ ఖండించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సీఎస్కే 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్ లో ఓడిపోయామన్న బాధతో ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు భారీ షాక్ తగిలింది. అతనికి ఐపీఎల్ నిర్వహకులు భారీగా ఫైన్ విధించారు. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయని…
విరాట్ కోహ్లీ అంటే చాలా మంది అభిమానులకు ఎంతో ఇష్టం.. కోహ్లీ ఆట చూసేందు కోసం ఎక్కడినుంచైనా వచ్చే వీరాభిమానులు ఉన్నారు. అంతేకాకుండా.. స్టేడియంలో అతని కోసం ఫ్యాన్స్ టీషర్ట్ లు ధరించడం కానీ, అతన్ని స్టైల్ ను ఫాలోవ్వడం చూస్తుంటాం. కొందరైతే చేతులు, మెడ, శరీరం మీద టాటూలు వేసుకున్న పిచ్చి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అలాంటిది.. ఓ వీరాభిమాని కోహ్లీని కలవాలని ఏకంగా, క్రీజులో ఉన్న కోహ్లీ వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లి కాళ్లు మొక్కాడు..…
తమ ఫిర్యాదు పై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడగానికి వచ్చిన మహిళపై ర్యాష్‌గా మాట్లాడిన కేసులో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ ముగ్గురు బండ్లగూడ పోలీసులపై వేటు విధించారు. బండ్లగూడ ఇన్స్పెక్టర్ షాకీర్ ఆలీతో పాటు ఎస్ఐ వెంకటేశ్వర్, కానిస్టేబుల్ రమేష్‌ను సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ కె.శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలలోకి వెళితే …చాంద్రాయణగుట్ట సీఆర్పిఎఫ్ క్యాంపస్‌కు చెందిన ముఖ లింగం సీఆర్పిఎఫ్ రిటైర్డ్ జవాన్. ప్రస్తుతం ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్…
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయ నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్... తన తండ్రి సమాధి వైఎస్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలను నిర్వహించారు.