సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)కు కీలక ప్లేయర్ దూరం కానున్నారని సమాచారం. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ లకు దూరమైన హసరంగ.. సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండరని క్రీడావర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎడమ మడమ గాయం కారణంగా ఐపీఎల్-2024 నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. సీజన్ సగం గడిచిన తర్వాత స్లో పిచ్‌లపై హసరంగ బ్యాటర్లకు ప్రమాదకరంగా మారతాడని, అలాంటి మ్యాచ్ విన్నర్…
జగన్ ఇంటికి వెళ్లే రోజు దగ్గరకు వచ్చిందని, ప్రజలు కసితో ఎదురుచూస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సామాజిక న్యాయం చేసేది టీడీపీనేనని ఆయన వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు.
ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు వచ్చిన కేసీఆర్ పర్యటనపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తప్పుపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కనీసం నాలుగు నెలలు కూడా కాకుండానే ఎండిపోయిన పంటల పేరుతోటి కేసీఆర్ రాజకీయం చేయడాన్ని ఆయన మండిపడ్డారు. ఎన్నికల కోసం కేసీఆర్ రైతుల దగ్గర ముసలి కన్నీళ్లు పెట్టుకుంటున్నారన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో 90 శాతం కలవాలని నిర్మాణం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే మిగిలిన 10 శాతం కాలువల నిర్మాణం చేసి ఉంటే…
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని నిలిపివేస్తూ నిన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్‌లో ఎంతో కాలంగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని రోడ్ నంబర్ 4లో విశేష వైద్య సేవలందిస్తున్న పల్స్ హార్ట్ హాస్పిటల్స్, నేడు తన రెండో శాఖని మియాపూర్‌లో ఏర్పాటు చేశారు. ఈ పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదివారం ప్రారంభించారు.
కాంగ్రెస్ 100రోజుల పాలనలో ఉద్దేర మాటలు తప్ప, ఉద్దరించింది ఏమి లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన కామారెడ్డిలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో లీకులు ఇస్తూ .. ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారని, పెద్ద ఎమ్మెల్యేలను కొంటారు తప్ప, ఉద్యమకారులను కార్యకర్తలను రేవంత్ రెడ్డి కొనలేరని ఆయన వ్యాఖ్యానించారు. పేగులు మేడల వేసుకోవడం కాదు, పేదలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకో అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి ఓటేస్తే భవిషత్ ఉండదు. బీబీ…
బాబు పాలన అంతా విధ్వంసమేనని, ప్రజలను ఇబ్బంది పెడతారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో మళ్ళీ ఆయన తీరు బయటపడిందన్నారు. వాలంటరీల వ్యవస్థ పై ముందు నుంచే చంద్రబాబు కక్ష పెంచుకున్నారని అన్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్- పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 199 పరుగులు చేసి పంజాబ్ ముందు 200 పరుగుల టార్గెట్ ను ఉంచారు. ఈ క్రమంలో లక్ష్యచేధనలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. దీంతో.. లక్నో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.
పరిశ్రమలు రావాలంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. కలిగిరి మండల కేంద్రంలో కాకర్ల సురేష్, మండల కన్వీనర్ బిజ్జం వెంకట కృష్ణారెడ్డి, వరికుంటపాడు మండలానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకులు, ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన సుంకర అంజనాద్రి, వెంకటాద్రిల ఆధ్వర్యంలో కలిగిరి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు.. సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరించారు.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలో తమ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు అభ్యర్థులు. ఈ క్రమంలో.. టీడీపీ గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రచారం నిర్వహించారు. విజయవాడ రూరల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు.