Nimmaka Jayakrishna: పాలకొండ నుంచి జనసేన తరఫున పోటీ చేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nimmaka Jayakrishna: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ సీనియర్ నేతగా ఉన్న నిమ్మక జయకృష్ణ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మరోవైపు జనసేన తరుఫున మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పాలకొండ, అవనిగడ్డ స్థానాల కోసం జనసేన గెలుపు గుర్రాలను అన్వేషిస్తోంది. పాలకొండ టికెట్ నిమ్మక జయకృష్ణకు, అవనిగడ్డ సీటు మండలి బుద్ధ ప్రసాద్‌కు ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నిమ్మక జయకృష్ణ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తాను పాలకొండ నుంచి జనసేన తరఫున పోటీ చేస్తానని తన మనస్సులోని మాటను బయటపెట్టారు.
జనసేనలో చేరిన నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ.. “పవన్ సమక్షంలో జనసేనలో చేరానని.. పాలకొండ నుంచి జనసేన తరపున పోటీ చేస్తానని వెల్లడించారు. ఈ విషయంలో పవన్ సానుకూలంగా ఉన్నారన్నారు. పాలకొండ ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ విక్రాంత్ కలిసి నియోజకవర్గాన్ని దోచేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరిని కూటమి తరపున తరిమి కొడతామన్నారు నిమ్మక జయకృష్ణ.
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
Read Also: Chandrababu: టీడీపీ కేడర్‌తో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. పింఛన్లపై కీలక ప్రకటన
టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పొత్తులో భాగంగా అవనిగడ్డ, పాలకొండ స్థానాలు జనసేన పార్టీకి వెళ్లాయి. దీంతో గతంలో ఇక్కడి నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసిన మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణకు నిరాశ ఎదురైంది. దీంతో టీడీపీకి గుడ్ బై చెప్పిన ఇద్దరు నేతలు జనసేన కండువా కప్పుకున్నారు. అవనిగడ్డ, పాలకొండ స్థానాలలో పలువురు పేర్లతో జనసేన సర్వేలు చేయించింది. 21 స్థానాల్లోనూ కచ్చితంగా గెలవాలని పట్టుదలగా ఉన్న పవన్ కళ్యాణ్.. సరైన అభ్యర్థిని ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఆ రెండు స్థానాలకూ అభ్యర్థుల ప్రకటనను పెండింగ్ పెడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే సీనియర్ నేతలైన వీరికి అవకాశం ఇవ్వాలని పవన్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!