గత ప్రభుత్వంలో భూముల కుంభకోణం ఎక్కడ లేని విదంగా జరిగిందన్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుంకుంటా మండలం 164/1 లో 26 ఎకరాల అటవీ భూమి..జూన్ 2023 లో ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. డిఫెన్స్ కి సబంధించిన 60 ఎకరాలు జూన్ లో ప్రయివేటు వాళ్ళకు అప్పగించింది గత ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. బొమ్మరాసిపేటలో.. 1065 ఎకరాల ప్రయివేటు భూమి.. భూమి..హక్కు దారులకు దక్కకుండా ధరణి…
బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.. నాపై చేసిన వ్యాఖ్యాలు సత్యదూరమైనవన్నారు రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. నేను చెప్పని మాటల్ని చెప్పినట్టు అబద్ధాలు చెప్పి నాపై తప్పుడు ఆరోపణలు చేయడం ఆయనకే చెల్లిందన్నారు. మొన్నటిదాక.. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతా అన్నా.. సహాయం చేయమని నన్ను అడిగిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.. ఇవ్వాల నాపై కామెంట్లు చేస్తున్నాడన్నారు. నేను కాంగ్రెస్ లకి వస్తా అన్నా.. మంత్రి పదవి…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్- పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. పంజాబ్ ముందు భారీ స్కోరును నిర్దేశించారు. పంజాబ్ బ్యాటింగ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన క్వింటాన్ డికాక్ (54) అర్ధసెంచరీతో రాణించాడు. కేఎల్ రాహుల్ (15) పరుగులు చేశాడు.
పిఠాపురంలో పోటీ చేయాలని కలలో కూడా అనుకోలేదని.. సమస్యలు నావి అనుకున్నాను తప్ప నియోజకవర్గం గురించి ఆలోచించలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పిఠాపురంలో లక్ష మెజారిటీ గెలిపిస్తా అన్నారని.. ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు.
సునీతా కేజ్రీవాల్‌తో కల్పనా సోరెన్ భేటీ.. ఏ నిర్ణయం తీసుకున్నారంటే..! జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. శనివారం ఆమె… సునీతా కేజ్రీవాల్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఈడీ విచారణ, కేజ్రీవాల్ జైలు కెళ్లిన పరిణామాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవలే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తాజాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో…
'హలో... నేను టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ నుండి ఫోన్ చేస్తున్నాను. మీ ఫోన్ నంబర్ కొన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించబడుతోంది. మేము ఈ నెంబర్ ను మూసివేస్తున్నాము. మీరు మీ నంబర్‌ను కొనసాగించాలనుకుంటే, మేము చెప్పిన వాటిని ధృవీకరించాలి...' అని మోసపూరితమైన కాల్స్ చేస్తుంటారు. ఒకవేళ.. ఈ కాల్ ని అలానే కొనసాగిస్తే మీ అకౌంట్ లో ఉన్న డబ్బును కొట్టేస్తారు. ఇదొక సైబర్ మోసం.. +92 నంబర్ నుండి వినియోగదారుల వాట్సాప్‌కు కాల్లు వస్తున్నాయి. ఫోన్ చేస్తున్న…
తప్పు చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడిని చిత్తూరు ఎమ్మెల్యేగా పెట్టారని.. రాష్ట్రాన్ని స్మగ్లింగ్‌కు అడ్డాగా మార్చారని విమర్శలు గుప్పించారు.
రంజాన్ మాసంలో బిర్యానీతో పాటు హైదరాబాదీ హలీమ్ తప్పనిసరిగా ఉండాలి. అయితే.. హలీంకు హైదరాబాద్‌కు ఫేమస్ అనే చెప్పాలి. అయితే.. నిన్న రాత్రి ఓ హలీం సెంటర్ వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. నిన్న రాత్రి ముషీరాబాద్ 4 చిల్లీస్ హోటల్ వద్ద స్ట్రీట్ ఫైట్ జరిగింది. వివరాల్లోకి వెళితే.. 4 చిల్లీస్ హోటల్ వద్ద ఏర్పాటు చేసిన ఓ హలీం సెంటర్‌కు కస్టమర్ వచ్చాడు. హలీం ఆర్డర్ ఇచ్చాడు.. అయితే.. హలీంను ఆరించిన సదరు వినియోగదారుడు…
227 పని దినాలు మరియు 75 సెలవులతో, 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ విద్యార్థులకు క్లాస్‌వర్క్ జూన్ 1 నుండి ప్రారంభమవుతుంది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TS BIE) శనివారం 2024-25 వార్షిక క్యాలెండర్‌ను మొదటి మరియు రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు జూన్ 1 నుండి క్లాస్‌వర్క్ షెడ్యూల్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి ముందు, జూనియర్ కళాశాలలను వేసవికి మూసివేయాలని సూచించబడింది. 2023-24 విద్యా సెషన్‌కు మార్చి 31…
టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ఏప్రిల్ చివరి వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ కోసం తమ ఆటగాళ్లను ప్రకటించడానికి మే 1 వరకు ఐసీసీ (ICC) గడువు ఇచ్చింది. దీంతో ఆలోపే జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కాగా.. ఐపీఎల్ స్టార్లపై సెలక్టర్లు దృష్టి పెట్టినట్లు టాక్. ఈ టోర్నీలో రాణించిన ఒకరిద్దరికి జట్టులో చోటు కల్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.…