ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్- పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అందులో భాగంగా టాస్ గెలిచిన లక్నో.. మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ బౌలింగ్ చేయనుంది. కాగా.. ఇప్పటివరకు లక్నో ఆడిన ఒక మ్యాచ్ లో ఓడిపోగా.. ఈ మ్యాచ్ లో గెలువాలనే కసితో బరిలోకి దిగుతుంది. మరోవైపు.. పంజాబ్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో..…
కష్టపడి పైసా పైసా కూడబెట్టుకొని సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ప్లాట్ల కోసం లక్షల్లో డబ్బులు చెల్లించి మోసపోయిన తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సాహితీ ఇన్ఫ్రాటెక్ బాధితులు వేడుకున్నారు. ఏండ్లు గడుస్తున్నా..నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఇప్పుడు రోడ్డునపడ్డాం అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ కేసు రేరా ( తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ) లో విచారణ జరుగుతుండటంతో… బాధితులు ఏసీ గార్డ్స్ లోని రేరా కార్యాలయం ముందు ఆందోళనకు…
ప్రతి వ్యక్తి తమ చర్మం యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. అందు కోసం ప్రజలు అనేక రకాల చికిత్సలు తీసుకుంటారు. బ్యూటీ పార్లర్లకు వెళ్లి రకరకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులను వాడుతుంటారు. కానీ చాలాసార్లు ఆశించిన ఫలితాలు రావు. తినే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఎక్కువగా చర్మ సంబంధింత సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే.. మీ చర్మం యవ్వనంగా కనిపించాలంటే కొన్ని మంచి ఆహారాలను తినడం మంచిది.
బీహార్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మోతీహరిలో భార్య, ముగ్గురు పిల్లలను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు భర్త ఇద్దుమియాన్. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు.. వారిని హత్య చేసి ఇంటి నుండి పారిపోయాడు. అయితే.. నిందితుడు ఇద్దును పట్టుకున్న వారికి మోతిహరి పోలీసులు రూ. 15,000 రివార్డు ప్రకటించారు. అందుకోసం నేరస్థుడిని పట్టుకునేందుకు పోలీసులు అన్ని చోట్లా గాలింపు చర్యలు చేపట్టారు.
వింజమూరు మండల కేంద్రంలో శుక్రవారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్యం కోసం తలపెట్టిన ప్రజాగళం దద్దరిల్లింది. ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో.. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుండి తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, బీజేపీ నాయకులు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రజాగళం సభకు తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలని జనం చంద్రబాబు ప్రసంగానికి జేజేలు పలికారు. చంద్రబాబు నాయుడు మాటలు ఆసక్తిగా విన్నారు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు.…
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఆంక్షలు విధించింది. పెన్షన్లు సహా లబ్దిదారులకు నగదు పంపిణీ వంటి కార్యక్రమాల అమలుకు వాలంటీర్లను దూరంగా పెట్టాలని సీఈసీ సూచించింది.
రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఎండాకాలం కావటంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిందని, అందుకు సరిపడే విద్యుత్తును అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. డిమాండ్ కు సరిపడేంత విద్యుత్తు అందుబాటులో ఉందని, కరెంటు పోయిందనే ఫిర్యాదు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించాలని సూచించారు. రోజురోజుకు ఎండలు మండుతుండటం విద్యుత్తు డిమాండ్…
నెల్లూరు జిల్లా కందుకూరులో ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ2 అయితే చంద్రబాబు పలు కేసుల్లో ఏ1 అని..తాను 22 కేసుల్లో ఏ2 కావచ్చు.. కానీ ఎక్కడా కూడా ఆర్థిక నేరాలకు పాల్పడలేదన్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఆడిన ఒక్క మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.. అయితే.. ఇక నుంచి గెలుపు బాటలు వేసేందుకు లక్నో కీలక నిర్ణయం తీసుకుంది. డేవిడ్ విల్లే స్థానంలో న్యూజిలాండ్ సీమర్ మ్యాట్ హెన్రీని తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే.. ఐపీఎల్ 2024 వేలంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ డేవిడ్ విల్లేను లక్నో సూపర్ జెయింట్స్.. రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.
మద్యం తాగొద్దని చెప్పినందుకు తన కుమారుడిని దుండగులు హత్య చేశారని ఓ తల్లి ఆరోపిస్తుంది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. జహంగీర్‌పురిలో దుండగులు 19 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి చంపారు. వివరాల్లోకి వెళ్తే.. మద్యం తాగవద్దని యువకుడి తల్లి కొందరు అగంతకులకు చెప్పింది. దీంతో.. కోపోద్రిక్తులైన దుండగులు ఆమె కొడుకును చంపేశారు.