రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకున్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోరిన కొరికలు తీర్చే దేవుడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి అని, గత ప్రభుత్వం హయంలో దేవాదాయ శాఖలో మితిమీరిమ అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. దేవుడిమాన్యాలు కుడా ఖబ్జాకు పెట్టారని, దేవాలయాలలో దేవుడి మాన్యం భూములు ఎన్ని ఉన్నాయో ఎంక్వైరీ చేస్తున్నామన్నారు కొండా సురేఖ. సర్వే చేసి హద్దులు ఎర్పాటు చేసి దేవుడి పేరు మీదే పట్టాపాసు బుక్కులు ఇస్తామని, తిరుమల తిరుపతి దేవస్తానం నుండి నిధులు తీసుకువచ్చి,దాతల సహాకారంతో దేవాలయాలు అభివృద్ధి చేస్తామన్నారు.
గతంలో మాదిరిగా దేవాలయాలలో దోపిడి జరుగకుండా చూస్తామని, బాసర దేవాలయం పై ఫిర్యాదులు వచ్చాయని ఆమె తెలిపారు. యాదాద్రి తరహాలో వేములవాడ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. సర్వే నెంబర్ల ద్వారా దేవాలయాల భూములకు హద్దులు గుర్తిస్తామని అన్నారు. అంతేకాదు.. దేవుడి పేరుతో పాసు పుస్తకాలు కూడా జారీ చేస్తామని తెలిపారు. అక్రమాలు, కబ్జాలకు పాల్పిన ఎవరినీ వదిలి పెట్టం. విచారణకు ఆదేశించామని అన్నారు. భక్తుల నుంచి వచ్చే విరాళాల స్వీకరణ కోసం ప్రత్యేక వెబ్‌సైట్లు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.