ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు డబుల్ డెక్కర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. గుజరాత్ ముందు 163 పరుగుల గౌరవప్రదమైన లక్ష్యాన్ని ఉంచింది.
చంద్రబాబు, బీజేపీ, పవన్ కల్యాణ్‌లు రాజకీయాల కోసం పేద ప్రజల మీద కక్ష తీసుకునే రాజకీయాలు చూస్తున్నామని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. పెన్షన్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ బీనామి సంస్థ సిటిజన్ ఫర్ డెమోక్రసి అని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో నీటి సమస్యే కాదు కరెంట్ సమస్య కూడా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నీటి సమస్యే కాదు కరెంట్ సమస్య కూడా నడుస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేసిఆర్ అంటేనే కాలువలు, చెరువులు నదులు ఆయన లేకపోతే నీటి ఎద్దడి వస్తుందని కేవలం 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించిందన్నారు. ప్రభుత్వ చేతగాని తనం వల్ల వచ్చిన కరువుగా దీనిని గుర్తించాలన్నారు. మన…
వాలంటీర్ల సేవల గురించి రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన మీడియా సమావేశంలో నిమ్మగడ్డ రమేష్, పవన్, చంద్రబాబులపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
మోడీ సర్కారు రాజ్యాంగ పునాదులు కూల్చేస్తుందlr, బీజేపీకి 2019 ఫలితాలు రావనే భయం పట్టుకుందన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భయం లేకుంటే కేజ్రీవాల్.. సోరేన్ లను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలకు కకావికాలం చేసి.. బలహీన పరిచే ఎత్తుగడలో బీజేపీ ఉందని, బీజేపీ బలంగానే ఉంటే ప్రతిపక్ష పార్టీల నాయకులను చేర్చుకుని టికెట్లు ఇస్తున్నారన్నారు. నీతికి నిర్వచనం మార్చేశారు మోడీ అని,…
Pakistan: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్తాన్ ఖర్చుల్ని తగ్గించుకుంటోంది. దుబారా ఖర్చులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పొదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ‘రెడ్ కార్పెట్’ల వినియోగాన్ని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో పింఛన్ల పంపిణీపై కొనసాగుతున్న సందిగ్ధతపై ఎట్టకేలకు క్లారిటీ లభించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఉండదని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ఉత్తర్వులు జారీ చేసింది.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌కు మళ్లీ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది పీసీబీ (Pakisthan Cricket Board). వన్డే వరల్డ్ కప్ తర్వాత బాబర్ ఆజం.. పాకిస్థాన్ జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత.. అతని స్థానంలో టీ20లకు షహీన్ అఫ్రిది, టెస్టులకు షాన్ మసూద్‌ను కెప్టెన్లుగా పీసీబీ నియమించింది.
ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అచ్చెన్నాయుడు తల్లి కళావతమ్మ తుదిశ్వాస విడిచారు. కొద్దిసేపటి క్రితం అనారోగ్యంతో కింజారపు కళావతమ్మ మృతి చెందారు.
మోడీ పదేళ్ళ లో కులాల కొట్లాటలు తెచ్చిండని, ఉద్యోగాలు అడిగితే రాముని అక్షింతలు పంపించిండన్నారు మంత్రి సీతక్క. ఆదానీ- అంబానీ రిలయన్స్, జియో ల కోసమే బీజేపీ పనిచేస్తుందని మంత్రి సీతక్క మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలే.. దేవుళ్ళ పేర్లు చెప్తున్నారు.. మన ఊర్లు అందరికి దేవుళ్ళు ఉన్నారని, గాంధీని చంపిన గాడ్సే కు మద్దతు తెలిపి పూజించే పార్టీ బీజేపీ పార్టీ అని ఆయన మండిపడ్డారు. బీజేపీ కరోనా సమయంలో ఎవరికి సహాయం చేయలేదని,…