ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్లో ఈడీ అరెస్టు చేసి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతితో రెండు విడతలుగా 10 రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అటవీప్రాంతంలో కార్చిచ్చు కలకలం రేపుతోంది. గ్రామ శివారు నీలగిరి చెట్ల ప్లాంటేషన్లో మంటలు చెలరేగి వేలాది మొక్కలు అగ్నికి అహుతి అవుతున్నాయి.
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (PNC) భారీ విజయాన్ని నమోదు చేసింది. 86 స్థానాల్లో ఫలితాలను ప్రకటించినప్పటికి.. ఆ పార్టీ 63 చోట్ల గెలిచినట్లు తెలిపగా.. మరో ఏడు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ముహూర్తాలు చూసుకుని నామినేషన్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.
Wife Kills Husband: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల మూలంగా సంసారాలు కూలిపోతున్నాయి. ముఖ్యంగా ఇలాంటి సంబంధాల్లో హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
నల్లగొండ జిల్లా దేవరకొండ డిపోనకు చెందిన డ్రైవర్ శంకర్ కు సెలవు మంజూరు చేయకుండా ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఆ డ్రైవర్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ నెల 18, 19 తేదీల్లో విధులకు గైర్హాజరు అయ్యారు. అయినా ఈ నెల 20న డ్యూటీని అధికారులు కేటాయించడం జరిగింది. మళ్ళీ ఆదివారం సెలవు కావాలని డిపో అధికారులను సంప్రదించడం జరిగింది. వాళ్ళు లీవ్ పొజిషన్…
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో వదర్లపాడు పంచాయతీ నుంచి 200 మంది, ఆలపాడు పంచాయతీ నుండి 200 మంది ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వర రావు, ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వర రావు, ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ లు వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా దూలం నాగేశ్వర రావు మాట్లాడుతూ.. చంద్రబాబుది అందితే జుట్టు.. అందకపోతే…
ఖమ్మం బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం ముందుకు వెళ్ళిందని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హత్యా రాజకీయం జరిగి ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా..? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో రక్తపు బొట్టు కిందపడకుండా రాష్ట్రాన్ని సాధించుకున్నామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు వచ్చి ప్రజలను ఓట్లు అడగడం సమంజసం కాదన్నారు…
తనను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్కక్కై కుట్రలు చేస్తున్నాయని, అందులో భాగంగానే నామినేషన్ల పర్వం ప్రారంభమైనా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిని ఇంతవరకు ప్రకటించలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొన్న బండి సంజయ్ నాటి మంత్రి కేటీఆర్ తాను ప్రతిపాదించిన కొన్ని కంపెనీల వద్దే యార్న్ కొనుగోలు చేయాలని షరతు పెట్టడంతో అధిక ధరకు…
రేవంత్ లా డ్యుయల్ రోల్ నేను చేయలేను.. రేవంత్ లా డ్యుయల్ రోల్ నేను చేయలేనని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. మోడీ పాలన చూసి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏ సర్వేలు చూసిన మోడీ మూడోసారి ప్రధాని అవుతారని వస్తున్నాయన్నారు. ఇంకొన్ని అంశాలు మిగిలి పోయాయి కాబట్టి 400 సీట్లు లక్ష్యంగా ముందుకి వెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు తీసుకొని నిర్ణయాలు మోడీ అమలు చేస్తున్నారని తెలిపారు. బ్యాంక్ ఖాతాలు ఓపెన్…