చైనాలోని దక్షిణ ప్రావిన్స్‌లోని గ్వాంగ్‌డాంగ్‌లో భారీ వర్షం కురిసి, ఆ ప్రాంతం చెరువులా మారింది. గత 65 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షాల కారణంగా 4గురు చనిపోగా, 10 మంది గల్లంతయ్యారు. ఈ వర్షం ప్రభావం గ్వాంగ్‌డాంగ్ రాజధాని గ్వాంగ్‌జౌలో తీవ్రంగా కనిపించింది. పెరల్ నది దిగువన ఉన్న పెరల్ రివర్ డెల్టాలో పెద్ద ప్రాంతం కూడా నీటిలో మునిగిపోయింది. ఈ వర్షం దెబ్బకి దాదాపు 1. 25 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 26 వేల మందిని షెల్టర్ హోమ్‌లకు పంపారు.
Read Also: Israel–Hezbollah conflict: హిజ్బుల్లా ఉగ్ర స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడి
కాగా, ఏప్రిల్ నెలలో గ్వాంగ్‌జౌలో 60.9 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. 1959 తర్వాత గ్వాంగ్‌జౌలో ఇంత భారీ వర్షాలు కురువడం ఇదే తొలిసారి. జావోకింగ్ నగరంలో ముగ్గురు మరణించగా, షావోగ్వాన్ నగరంలో ఒకరు చనిపోయినట్లు ప్రకటించారు. అయితే, ఈ వ్యక్తులు ఎలా మరణించారనే దానిపై ఎలాంటి సమాచారం అందలేదు. గత శనివారం ప్రారంభమైన వర్షాలు గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని ఈ రెండు నగరాల్లో మాత్రమే కనిపించింది. నగరం లోపల రోడ్లపై పడవలు తిరిగే పరిస్థితి నెలకొంది.
Read Also: Gold Price Today : భారీగా తగ్గిన బంగారం ధరలు.. అదే దారిలో వెండి..తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
ఇక, జియాంగ్జీ ప్రావిన్స్‌లో కూడా వర్షం విధ్వంసం సృష్టించింది. అక్కడి నుంచి 460 మందిని సురక్షిత ప్రాంతాలకు పడవల ద్వారా తరలిస్తున్నారు. ఈ వర్షం కారణంగా పంటలు కూడా పెద్ద ఎత్తున దెబ్బ తిన్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ వాన వల్ల దాదాపు 41 మిలియన్ యువాన్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. గ్వాంగ్‌డాంగ్‌ను ప్రపంచంలోని ఫ్యాక్టరీ కారాగారం అని పిలుస్తారు. ఇక్కడ భారీ స్థాయిలో తయారీ కంపెనీలు ఉన్నాయి.. ఆకాల వర్షం కారణంగా భారీ నష్టాలు చవి చూస్తున్నాయి. దాదాపు 6 దశాబ్దాల తర్వాత ఇక్కడ ఇంత భారీ వర్షాలు కురవడం ఇదే తొలిసారి.