పశ్చిమ బెంగాల్‌లోని స్కూల్ రిక్రూట్మెంట్ కుంభకోణంపై ఇవాళ (సోమవారం) తీర్పు వెలువరిస్తూ కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ 2016 నాటి మొత్తం ప్యానెల్‌ను రద్దు చేయాలని ఆదేశించింది.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తన వ్యంగాస్త్రాలతో మాటల దాడికి దిగుతున్నారు. బీజేపీకి ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్రలో భాగంగా హనుమాన్ వ్యాయామశాల వద్ద ఉపన్యసిస్తూ ఎన్నికల నియమావళి ఉల్లఘించారని కేసు నమోదు చేశారు. సుల్తాన్‌బజార్ పీఎస్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ ఫిర్యాదు మేరకు అదే పీఎస్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు.
తెలంగాణ అమరనాథ్ యాత్రగా గుర్తింపు పొందిన సలేశ్వరం జాతర నేడు ప్రారంభమైంది. నేటి నుంచి మూడు రోజులపాటు నల్లమల అభయారణ్యంలోని సళేశ్వరం జాతర జరగనుంది.
ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడటంతో మహిళ మృతి చెందిన ఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలో ఆదివారం జరిగింది. మూసాపేట్ వై జంక్షన్ వద్ద చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే మహిళ(45)పై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. తీవ్రరక్తస్రావమై ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
గత నెలలో బెంగళూరు కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనలో ఇద్దరు నిందితులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వారి గురించి కీలకమైన అంశాలపై ఆరా తీస్తున్నారు.
ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న జరుపుకుంటారు. భూమి మానవులకే కాదు లక్షలాది జంతువులు, మొక్కలకు నిలయం.. కానీ మానవులు తమ అవసరాలను తీర్చుకోవడానికి భూమికి అనేక రకాల హాని కలిగిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల విషయంలో వ్యవహారాలను చక్కబెట్టేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. బోర్డు ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలోకి కేఆర్ఎంబీ వెళ్లిపోయింది.