వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 20వ రోజుకు చేరుకుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ శనివారం రాత్రి బస చేసిన చిన్నయపాలెం ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరనున్నారు.
ఏటీఎం నగదు నింపే వ్యాన్లో 66 లక్షల రూపాయలను దొంగలు ఎత్తుకెళ్లి మర్రిచెట్టులో దాచారు. ఏటీఎంలో నగదు నింపే వ్యాన్లో పట్టపగలే లక్షల రూపాయలు దోచుకెళ్లారు దొంగలు. ఏకంగా రూ. 66 లక్షలను ఎక్కడ దాచాలో తెలియక మర్రిచెట్టు తొర్రలో దాచిపెట్టారు.
జనసేనలో అనుభవం ఉన్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి వైసీపీలోకి రావడం హర్షణీయమని నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి వైసీపీలోకి రావడాన్ని చూస్తే జనసేన ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతుందన్నారు.
ఏపీలో ఎన్నికల వేళ.. ఈసీ వద్ద వివిధ పార్టీల ఫిర్యాదులతో పంచాయతీ నెలకొంది. ప్రతి ఎన్నికల్లోనూ ఉండే తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ ఒకరిపై ఒకరు ఈసీకి అధికార-ప్రతిపక్ష పార్టీలు పరస్పర కంప్లైంట్లు ఇచ్చుకుంటున్నారు. షెడ్యూల్ విడుదల కాక ముందు నుంచి వైసీపీ - టీడీపీ పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి.