రాష్ట్రంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు దాఖలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు(ఈ నెల 23) పిఠాపురంలో నామినేషన్ వేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు చేబ్రోలు నుంచి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ వరకు వేల మందితో ర్యాలీగా తరలివెళ్తారు. శ్రీపాద వల్లభుడు దర్శనం అనంతరం నామినేషన్ వేస్తారు. అదే రోజు సాయంత్రం ఉప్పాడ కొత్తపల్లి లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.…
నెహ్రు ప్రధానిగా ఉన్నప్పుడే శ్రీరాముడు పాలన మొదలైంది.. అదే పునాది అని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెహ్రు పాలన తప్పు పట్టె వాళ్ళు .. నెహ్రు ఉన్నప్పుడే మోడీ పుట్టి ఉంటే బాగుండేది.. మా తప్పు కాదు అది అని, శ్రీరాముడు కూడా దేశానికి మొదటి ప్రధాని నెహ్రు కావాలి అని ఆయన్నే పుట్టించారన్నారు. .గాంధీ..నెహ్రు ల చరిత్ర పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి.. సీఎం ని కలిసి…
కేశినేని చిన్నికి కేశినేని నాని కౌంటర్ వేశారు. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిది కార్పొరేటర్ స్థాయి కంటే హీనం అని విమర్శించారు. ఆయనకి 12 లేదా 14 వేల ఓట్లు మాత్రమే వస్తాయి.. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్ధి కూడా విజయం మీకు లేదా మాకు మధ్యే అని చెప్పాడన్నారు. ఫలితాలు చూస్తే అతనికి 12 వేల ఓట్లు వచ్చాయన్నారు.
ఆగస్టు సంక్షోభం భయంతోనే కోమటిరెడ్డి సీఎం అని రేవంత్ చెప్తున్నారని, ఏ ఊరికి వెళ్లిన అక్కడి నేతకు నీవే నెక్స్ట్ సీఎం అని ఆయనతో చెప్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కేసీఆర్ 20మంది టచ్ లో ఉన్నారనే మాటలు చూస్తే .. కేసిఆర్ తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి టచ్ లో ఉన్నారేమో అని ఆయన అన్నారు. నాకు అయితే అదే అనుమానం ఉందని, సీఎం హామీలను…
కాంగ్రెస్ సంపదను, మహిళల పుస్తెలు.. ముస్లిం లకు పంచుతామనీ అంటున్నారని మాజీ పీసీసీ అధ్యక్షుడు వీ హెచ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగంలో అందరూ సమాన హక్కులు ఉంటాయని మర్చిపోయారని, ముస్లిం ఓట్లు బీజేపీ పడవని ఇలా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారన్నారు. పదేళ్లలో బీజేపీ ఏం చేశావో చెప్పు అని, ధరలు పెంచినందుకు.. ఉద్యోగాలను ఇవ్వనందుకు బీజేపీ కి ఓటు వేయాలా..? అని ఆయన ప్రశ్నించారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని రాహుల్…
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో సారి నిరాశ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ అరెస్టుపై కవిత వేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును మే 2కు రిజర్వ్ చేసింది. ఈడీ అరెస్టులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే రుణమాఫీ చేసుకోబోతున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం డైట్ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
భారత్-కువైట్ మధ్య దౌత్యపరంగా మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. కువైట్‌లో మొట్టమొదటి సారి హిందీ రేడియో ప్రసార కార్యక్రమం ప్రారంభమైందని భారత రాయబార కార్యాలయం ఇవాళ (సోమవారం) ఎక్స్ వేదికగా తెలిపింది.
బీజేపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఉదయం 11.15 గంటలకు రాజేంద్రనగర్‌లోని తహసీల్దార్ ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రలో సంచరిస్తున్న ఏనుగుల మందలో నుంచి ఓ ఏనుగు తప్పిపోయి మన రాష్ట్రంలోకి ప్రవేశించింది. అటవీ అధికారులు ఎంతో శ్రమించి ఆ ఏనుగును తిరిగి మహారాష్ట్ర అడవుల్లోకి పంపించారు.