Snakes on a Plane: కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 పసుపు అనకొండలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని అరెస్టు చేశారు. అతని చెక్-ఇన్ బ్యాగేజీలో సరీసృపాలు దాగి ఉన్నాయి. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక పోస్ట్‌లో.. బెంగళూరు కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు బ్యాంకాక్ నుండి వచ్చిన ప్రయాణికుడిని అడ్డగించి అరెస్టు చేశారని చెప్పారు. “ప్రయాణికుడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. వన్యప్రాణుల అక్రమ రవాణాను సహించబోము” అని కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఎక్స్(ట్విట్టర్) పోస్టులో పేర్కొన్నారు.
Read Also: Singapore: గర్ల్‌ఫ్రెండ్‌ను కొట్టి చంపిన ఇండియన్కి 20 ఏళ్ల జైలు శిక్ష
పసుపు అనకొండ అనేది నీటి వనరులకు దగ్గరగా కనిపించే ఒక నదీ జాతి. పసుపు అనకొండలు సాధారణంగా పరాగ్వే, బొలీవియా, బ్రెజిల్, ఈశాన్య అర్జెంటీనా, ఉత్తర ఉరుగ్వేలో కనిపిస్తాయి. చట్టం ప్రకారం, భారతదేశంలో వన్యప్రాణుల వ్యాపారం, అక్రమ రవాణా చట్టవిరుద్ధం.
గత ఏడాది, బ్యాంకాక్ నుండి ఒక ప్రయాణికుడు అక్రమంగా రవాణా చేసిన కంగారూ పిల్లతో సహా 234 వన్యప్రాణులను బెంగళూరు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రక్షించారు. ప్లాస్టిక్ పెట్టెలో ఉన్న కంగారూ పిల్ల ఊపిరాడక మృతి చెందింది. కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌కు పక్కా సమాచారం అందడంతో ఆ వ్యక్తి సామాను సోదా చేయగా ట్రాలీ బ్యాగుల్లో దాచి ఉంచిన కొండచిలువలు, ఊసరవెల్లులు, ఇగువానా, తాబేళ్లు, ఎలిగేటర్‌లు కనిపించాయి.