రోజురోజుకు ఆన్లైన్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. మోసగాళ్లు బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. మీ కేవైసీ వివరాలను అప్డేట్ చేస్తున్నట్లు ఫోన్ చేయడం, ఉద్యోగం వచ్చిందంటూ ఫోన్ చేయడం, మీ ఖాతాను బ్లాక్ చేస్తానని బెదిరించడం ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. 18.4 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ కోల్పోయి 183 పరుగులు చేసి తమ ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది. యశస్వి జైస్వాల్ అద్భుత సెంచరీతో రాణించడంతో అలవోకగా విజయం సాధించింది. జైస్వాల్ (104*) పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 7 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. తన…
వచ్చే నెల రోజుల పాటు రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని నిషితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలని అధికారులను కోరారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మున్సిపల్, నీటిపారుదల, పంచాయితీ రాజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని సమీక్షించారు. సరఫరాలో అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజలు…
ఏపీలో నాల్గవ రోజు నామినేషన్ల ప్రక్రియ ఉత్సహంగా సాగింది. నామినేషన్ల దాఖలకు ముందు కొందరు అభ్యర్థులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తల నడుమ భారీ ర్యాలీలతో వెళ్లి నామినేషన్ల ప్రక్రియ కొనసాగించారు. అధికార, విపక్ష పార్టీలతో పాటు కొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామపత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఇప్పటి వరకు ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు 293 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అంతేకాకుండా.. 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇప్పటి…
అధికారంలో ఉన్నా… లేకపోయినా తాను బలమైన వ్యక్తిని అని వ్యాఖ్యానించారు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఎన్టీవీ నిర్వహించిన క్వశ్చన్ అవర్లో ఇవాళ జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీ పాత్రికేయులు వేసిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ…… ఐదేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు.. మంత్రులూ అలాగే ఉంటారని… ఇందులో ఎలాంటి అనుమానం లేదని జగ్గారెడ్డి వెల్లడించారు. అంతేకాకుండా… తాము మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు మా వ్యూహాలు మాకు ఉన్నాయని ఆయన తెలిపారు.…
నిజామాబాద్ జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ అంటే నాకు ప్రత్యేక అభిమానమన్నారు. మూతపడిన చక్కెర కర్మాగారం తెరిచేందుకు విధి విధానాల కోసం శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నియమించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17లోగా చక్కెర కర్మాగారం తెరిపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. వందరోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తామని కేసీఆర్ మోసం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. వరి వేస్తే…
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 179 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ముంబై బ్యాటింగ్ లో ఒకానొక సమయంలో 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబై ఇండియన్స్ ను తిలక్ వర్మ (65) దూకుడు బ్యాటింగ్ తో ఆదుకున్నాడు. అతనితో పాటు నేహాల్ వధేరా (49) పరుగులు చేయడంతో..…
చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ప్రతి అర్హుడికి ఆరు గ్యారంటీలకు తీసుకువచ్చేందుకు తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. తన ప్రాంతంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందేదాకా తాను నిద్రపోనని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం పెద్దెముల్ మండలం గొట్లపల్లి, తట్టెపల్లి గ్రామాల్లో ఎంపీ రంజిత్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యేలు టీ.రాంమోహన్ రెడ్డి, బి. మనోహర్ రెడ్డితో కలిసి ఆయన ప్రచారం…
వైసీపీ మేనిఫెస్టోకు తుది మెరుగులు.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అడుగులు వెస్తోంది. మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగానే వైసీపీ మ్యానిఫెస్టోను మెరుగులు దిద్దేందుకు పార్టీ నాయకులు పూనుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఇవాళ అంతర్గత సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ రోజంతా సీఎం మ్యానిఫెస్టోపై చర్చిస్తారు. నూతన అంశాలు, కొత్త పథకాలపై కసరత్తు చేస్తారు. ఈ నేపథ్యంలో కొందరు ముఖ్య నేతలు జగన్ ను కలిశారు.…
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార వైసీపీ పార్టీపై తీవ్ర విమర్శలు కురిపించారు. శృంగవరపుకోట యుద్ధానికి సై అంటుంది.. కాలు దువ్వుతుంది. దీనికి కారణం.. బాధ, ఆవేదన అని వ్యాఖ్యలు చేశారు. ఒకటే నినాదం.. వైసీపీ ఓడిపోవాలని తెలిపారు. ఎన్నో తుఫాన్లు చూశా.. మే 13న ఒకటే తుఫాన్ అని అన్నారు. వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవాలని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరికైనా రక్షణ ఉందా.. మహిళలకు అస్సలు…