మా అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ర్యాలీ కి వచ్చిన ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ రాజ్యసభ డా.లక్ష్మణ్. ఇవాళ ఆయన బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండుటెండను సైతం లెక్క చేయకుండా భువనగిరి కోట పై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు సిద్ధమయ్యారన్నారు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడన్నారు. మోడీ నీ విమర్శించే స్తాయి రేవంత్…
కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందని, 2 లేదా 3 సీట్లు బీజేపీ గెలుస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంతేకాకుండా.. బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రావడం కష్టమే అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.ఈ నేపథ్యంలోనే ఏ ముఖం పెట్టుకొని మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర( KCR Bus Yatra ) చేపడుతున్నారని ప్రశ్నించారు. దేశంలో మత ఘర్షణలు చెలరేగేలా మోదీ మాట్లాడటం…
ఐపీఎల్ 2024లో కేకేఆర్ తరుఫున ఆడుతున్న వెస్టిండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ కీలక ప్రకటన చేశాడు. తాను టీ20 ప్రపంచకప్ లో రీఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలపై స్పందించాడు. తిరిగి మళ్లీ వెస్టిండీస్ జట్టులోకి రాలేనని.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాడు. రీఎంట్రీకి తలుపులు మూసుకుపోయాయని అన్నాడు. ఈ విషయమై నరైన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశాడు.
100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, డిసెంబర్ 9 తేదీన 6 గ్యారంటీల్లో 13 హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు రైతు బంధు ఆపిన ఘనులు వీళ్ళే అని ఆయన అన్నారు. రుణమాఫీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. అర్హులైన రైతులందరికీ రైతు బంధు వచ్చిందని నిరూపిస్తే.. మా ఎంపీ అభ్యర్థిని ఎన్నికల బరి నుంచి తప్పిస్తా అని జగదీష్ రెడ్డి అన్నారు.…
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు వైసీపీ ప్రధాన కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం ఏ విధంగా వీస్తుందో.. రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్న ప్రముఖ సర్వే సంస్థలు కూడా వైసీపీ గెలుస్తుందని చెబుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పార్టీ చూడం, కులం చూడం.. జగనన్నకు మాత్రమే ఓటు వేస్తామని చెబుతున్నారని తెలిపారు.
ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్దిగా విడదల రజనీ పోటీ చేస్తున్నారు. అయితే.. ఎన్నికల ప్రచారం భాగంగా నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు విడదల రజిని. ప్రచారంలో అడుగడుగునా విడదల రజినికి ప్రజలు నీరాజనం పట్టారు. తమ మద్దతు విడదల రజినికే అంటూ నినాదాలు చేశారు. హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. విడదల రజిని ప్రచారంలో భారీగా ప్రజలు పాల్గొన్నారు. వైసీపీ అధికారంలో వచ్చిన తరువాత చేసిన…
ఏపీలో ఎన్నికలు రచ్చ రేపుతున్నాయి. వేసవిలో ఎండకంటే.. రాజకీయాల వేడి ఠారెత్తిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అధికార వైసీపీని గద్దెదించేందుకు కంకణం కట్టుకున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పిఠాపురంలో తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఎండిఓ కార్యాలయంలో ఉన్న ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు.…
ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ఓ కానిస్టేబుల్ ప్రభుత్వ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు ముందే భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మరణ వార్త తెలిసిన వెంటనే కొన్ని గంటల తర్వాత రైఫిల్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు.
ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్మెంట్ భారీగా వజ్రాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఇక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలను, తమ శరీరంపై ఉన్న బట్టల్లో బంగారాన్ని దాచి తీసుకువస్తున్నట్లు సమాచారం.
హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. హనుమంతుడి చేతిలో ఇన్సులిన్ పెట్టి శోభాయాత్ర చేయడం పట్ల నెటిజన్లు, హిందుత్వ వాదులు ఫైర్ అవుతున్నారు.