అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ (AMU) వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ నైమా ఖాతూన్ నియమితులయ్యారు. వర్సిటీ 100 ఏండ్ల చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించారు. ఆమె నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు.
చైనాలోని దక్షిణ ప్రావిన్స్‌లోని గ్వాంగ్‌డాంగ్‌లో భారీ వర్షం కురిసి, ఆ ప్రాంతం చెరువులా మారింది. గత 65 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షాల కారణంగా 4గురు చనిపోగా, 10 మంది గల్లంతయ్యారు.
చైల్డ్ కేర్ లీవ్‌పై సుప్రీం కోర్టు వికలాంగ పిల్లల సంరక్షణకు సెలవు ఇవ్వకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రమైన అంశంగా పరిగణించింది. వికలాంగ బిడ్డను చూసుకునే తల్లికి శిశు సంరక్షణ సెలవును నిరాకరించడం శ్రామికశక్తిలో మహిళల సమాన భాగస్వామ్యాన్ని నిర్ధారించే రాష్ట్ర రాజ్యాంగ విధిని ఉల్లంఘించడమేనని సోమవారం పేర్కొంది.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 పసుపు అనకొండలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని అరెస్టు చేశారు. అతని చెక్-ఇన్ బ్యాగేజీలో సరీసృపాలు దాగి ఉన్నాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు తీహార్ జైలు అధికారులు ఇన్సులిన్ ఇచ్చారు. ఈ విషయాన్ని మంగళవారం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రక్తంలో చక్కెర స్థాయి పెరిగి 320కి చేరుకోవడంతో సోమవారం రాత్రి తీహార్ జైలులో ఇన్సులిన్‌ను అందించారు.
యూఏఈలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలకు సంబంధించిన కొన్ని ఫోటోలను నాసా విడుదల చేసింది. ఇందులో వర్షం కురిసే ముందు, తర్వాత ఆ ప్రాంతం చూపబడింది.
తూర్పు ఆసియా దేశం తైవాన్ తీవ్ర భూకంపాలతో వణికిపోతుంది. సోమవారం నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు 24 గంటల వ్యవధిలో మొత్తం 80 భూకంపాలు సంభవించినట్లు పేర్కొన్నారు.
మాజీ ప్రధానులు కొత్త భారతదేశాన్ని రూపొందించడానికి పనిచేశారని, అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఇతరులను మాత్రమే విమర్శిస్తున్నారని, గత పదేళ్లలో తన ప్రభుత్వం ప్రజలకు చేసిన వాటి గురించి మాట్లాడలేదని ఎన్సీపీ(ఎస్పీ) నాయకుడు శరద్ పవార్ సోమవారం అన్నారు.
గత నెల పుట్టినరోజు కోసం ఆన్లైన్లో ఆర్డర్ చేసిన బర్త్‌డే కేక్ తిని పంజాబ్‌లో పదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. చిన్నారి తిన్న కేక్‌లో సింథటిక్ స్వీటెనర్ అధిక స్థాయిలో ఉన్నట్టు ఆరోగ్య శాఖ అధికారి సోమవారం వెల్లడించారు.