వైసీపీ మేనిఫెస్టోపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. విశాఖ పార్లమెంట్‌కు 32 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని.. ఈ రోజు సీఎం జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేశారని తెలిపారు. మేనిఫెస్టో మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని సీఎం జగన్ చెప్పారన్నారు.
హరీష్ రావు డ్రామా రావుగా మారారని కడియం శ్రీహరి విమర్శించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. మొదట సవాల్ చేసింది హరీష్ రావే ఆ సవాలను స్వీకరించింది సీఎం రేవంత్ రెడ్డి అని, పంద్రాగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుద్దామంటూ సీఎం ప్రకటన చేస్తే.. రాజీనామా చేస్తా అన్న హరీష్ రావు రాజీనామా కట్టుబడి ఉండాలన్నారు. కానీ.. రుణమాఫీపై రాజీనామా చేస్తున్నటువంటి హరీష్ రావు ఆ తర్వాత మాట మార్చారని, రుణమాఫీ తో…
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో మెజారిటీ ఇచ్చిన మండలం మాచారెడ్డి అని, మీరు ఆశీర్వదిస్తే కామారెడ్డి నియోజక వర్గంకి త్రాగు సాగు నీరు తెప్పిస్తానన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల పథకం నిలిపేసింది… లేకుంటే మచారెడ్డి లో నీళ్ళు వచ్చేవని ఆయన అన్నారు. మోడీ రిజర్వేషన్లు తీసేస్తామంటున్నాడు. దేశ ప్రజలు నష్టపోతారని ఆయన మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలిస్తామని,…
ఏపీలో ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీలో కొనసాగిన యనమల కృష్ణుడు నేడు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇటీవల బంగారం స్మగ్లింగ్ చేస్తూ చాలా మంది పట్టుబడుతున్నారు. బంగారం స్మగ్లింగ్ చేసే సమయంలో వారి తెలివితేటలు చూసి అధికారులు షాక్ అవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి పురీషనాళంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించి అధికారులకు చిక్కాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ సంచలనం సృష్టించింది. 262 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే చేధించి రికార్డు సృష్టించింది. 262 పరుగుల టార్గెట్ ను పంజాబ్ బ్యాటర్లు చితక్కొట్టారు. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి కోల్‌కతా బౌలర్లకు తమ హోంగ్రౌండ్ లో చుక్కలు చూపించారు. బ్యాటింగ్ కు వచ్చినోళ్లు వచ్చినోళ్లు సిక్సర్ల వర్షం కురిపించారు. 262 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ (54)…
ఎన్నికల ప్రచారంలో వైస్సార్సీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు దూసుకుపోతున్నారు. ప్రతి గడప గడపకు తిరుగుతూ... మరొక అవకాశం ఇవ్వాలని కోరుతూ... ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ.. ఫ్యాన్ గుర్తు కు ఓటు వేసి, మరొకసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని జగన్మోహనరావు కోరుతున్నారు. పూలతో, హారతులతో మహిళలు, ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు.
ఐపీఎల్ ముగియగానే టీమిండియా.. టీ20 వరల్డ్ కప్ 2024 ఆడనుంది. అందుకు సంబంధించి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి పొట్టి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ టోర్నీలో భాగమయ్యే ఆయా జట్లు తమ వివరాలను మే 1లోపు ఐసీసీకి సమర్పించాల్సి ఉంది. దీంతో భారత జట్టును ఎంపిక చేసే పనిలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పడింది. కాగా.. ఏప్రిల్ 28 లేదా 29న భారత…