నేతన్నలు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు,ఎలాంటి కష్టం వచ్చినా ప్రభుత్వాన్ని సంప్రదించండని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇవాళ ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాట్లాడుతూ.. ప్రభుత్వం జి.ఓ.నెం.1 లో నేతన్నలకు పాలసి తీసుకువస్తోందని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల కన్నా అధిక ఆర్డర్లు ఇచ్చి అధిక సంపాదన వచ్చేటట్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెక్స్టైల్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతన్నల ఉపాధి కొరకు సానుకూలంగా ఉన్నారని, గత ప్రభుత్వం చేసిన అప్పులను చక్క…
60 ఏళ్ల వయస్సులో ఎవరైనా ఏం చేస్తు్ంటారు. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ.. కృష్ణా రామా అంటూ కాలం వెళ్లదీస్తారు. కానీ ఓ వృద్ధురాలు మాత్రం అందం యువత సొంతం మాత్రమే కాదని నిరూపించింది. అందాల పోటీల్లో కుర్రకారు మాత్రమే గెలుస్తారన్న విశ్వాసాన్ని కూడా పటాపంచలు చేసింది అర్జెంటీనాకు చెందిన ఈ 60 ఏళ్ల అందాల భామ.
రాహుల్ గాంధీ జోడో యాత్రలో జనాభా దామాషా ప్రకారం మా రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ.. ఓబీసీ నేతలు అడిగారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎంత జనాభా ఉంటే..అంత రిజర్వేషన్లు ఇస్తాం అన్నది మా విధానమన్నారు. 1925 లో ఆర్ఎస్ఎస్ మొదలు పెట్టినప్పుడు రేసేర్వేషన్ లు లేని దేశం చేస్తాం అన్నారని, ఈస్ట్ ఇండియా కంపెనీ ..సముద్రం పక్కన సంసారం మొదలు పెట్టిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా సూరత్ నుండి ఆధాని…
అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదారి సమీపంలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ నుంచి తుని వైపు వెళ్తోన్న కారు వెదుళ్లపాలెం జంక్షన్ వద్దకు రాగానే డివైడర్ను ఢీకొని అవతలి వైపు వస్తున్న లారీని ఢీకొట్టింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి ఆర్మీ చీఫ్, షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. పాకిస్థాన్ను బానిసలుగా మార్చే వారితో తాను ఎలాంటి రాజీపడబోనని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. 9 ఏళ్లు జైల్లో ఉండేందుకు సిద్ధమన్నారు.
ఏపీలో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు.
చంద్రబాబు 160 సీట్లు వస్తాయని పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. గెలిచే అవకాశం లేదని టీడీపీ నాయకులకు కూడా తెలుసన్నారు. 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన విమర్శలు గుప్పించారు.
అలా నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుని.. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తా.. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటా అని, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. సంజయ్ సమక్షంలో పలువురు నేతలు బీజేపీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలరా… ఎందుకీ డ్రామాలు…? అంటూ మండిపడ్డారు. 6…
జపాన్లోని బోనిన్ దీవుల్లో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్లోని బోనిన్ దీవుల్లో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) శనివారం సమాచారం ఇచ్చింది. భూకంప కేంద్రం 503.2 కిమీ (312.7 మైళ్ళు) లోతులో ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.
ఉపాధి హామీ పథకం పేదలకు అన్నం పెట్టిందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామంలో నే జీవనోపాధి కలిపించిన పథకం తెచ్చింది సోనియా గాంధీ అని, ఉపాధి హామీతో గ్రామాభివృద్ధి.. జీవనోపాధి కల్పించినది సోనియమ్మ అని ఆయన వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ.. పాండవులు వనవాసం వెళ్ళినప్పుడు భోజనము పెట్టిన అక్షయ పాత్ర ఎట్లనో ఉపాది హామీ పథకం కూడా పేదలకు అక్షయ పాత్ర లాంటిదని, అలాంటి పేదల పథకం మోడీ పక్కన…