కాంగ్రెస్ దిగజారి ప్రకటనలు చేస్తుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వారసత్వాన్ని కొనసాగిస్తుందని, ఇటలీకి చెందిన సోనియా గాంధీని దేశ ప్రధాని చేయాలని చూశారన్నారు. మా పార్టీ సోనియా ప్రధాని కావడాన్ని అడ్డుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ మారిందని ఆయన విమర్శించారు. ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ అని, దేశానికి పట్టిన…
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని 19వ వార్డులో ఎన్డీయే కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా.. ప్రతి ఇంటికీ మహిళలు కొలికపూడికి మంగళ హారతులు, పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ, సూపర్ సిక్స్ పథకాలను కొలికపూడి ప్రజలకు వివరించారు. తిరువూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేస్తాను.. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ఓటు వేయండి.. తిరువూరిని అభివృద్ధి చేసి చూపిస్తా అని హామీ ఇచ్చారు.
చేవెళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా.. ఆయన చేవెళ్ల ప్రాంతానికి ప్రత్యేకంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించి శుక్రవారం విడుదల చేశారు. తనను గెలిపించడం ద్వారా.. నియోజకవర్గ ప్రజలకు రాబోయే ఐదేళ్లలో చేయనున్న పనులను సంకల్ప పత్రం పేరిట ప్రజల ముందుకు తీసుకొచ్చారు. చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన ఈ సంకల్ప పత్రాన్ని మీడియాకు వివరించారు. చేవెళ్లను దేశంలో…
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే రాజేందర్ రావు నీ గెలిపించండని ఆయన కోరారు. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ హిందువులకు ఎప్పుడైనా అన్యాయం చేసిందా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తె అదానీ అంబాణీలకు ఇచ్చిన ఆస్తులు గుంజుకొని పేదలకు పంచే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది…
ఘర్ వాపసీ మొదలు పెట్టాం.. రెండు రోజులుగా జరుగుతుంది ఇదే అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చాలా మంది నాయకులు వెనక్కి వస్తున్నారని, సంబాని చంద్రశేఖర్.. లాంటి వాళ్ళు కూడా వెనక్కి వచ్చారన ఆయన తెలిపారు. ఎవరు వచ్చినా చేర్చుకుంటామని ఆయన వెల్లడించారు. మనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళను కూడా చేర్చుకోవాలాని పార్టీ సూచించిందని, నాకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళు వచ్చి చేరుతా అన్నా..చేర్చుకుంటామన్నారు జగ్గారెడ్డి.…
కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు మరో కార్యక్రమం లేదని, జగన్ ను నన్ను విమర్శించేది పనిగా పెట్టుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డిని రేవంత్ మాడా అని మాట్లాడారని, చంద్రబాబు రాయలసీమ నుండి వైసీపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారన్నారు మంత్రి పెద్దిరెడ్డి. రాయలసీమ లో పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని, రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్…
మాజీ మంత్రి సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో ఇవాళ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. అని, గత ఎన్నికల్లో ఎన్నికల అధికారి పెట్టిన కేసులో నా పేరు ఉందని సోమిరెడ్డి నిరూపించగలరా..? అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ పాలనలో కేసులు నమోదు చేసారా.. లేక టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నమోదైందా.. ..చెప్పే దమ్ము సోమిరెడ్డికి ఉందా అని…
పార్లమెంటులో జాతీయ రహదారుల కోసం గళ మెత్తింది నేనే.. జాతీయ రహదారుల కోసం పార్లమెంటులో గళ మెత్తింది నేనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ పట్టణం లోని అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్ ను కలసి బోయినిపల్లి వినోద్ కుమార్ ప్రచారంలో మాట్లాడుతూ.. కరీంనగర్ కు ఎంపీగా స్మార్ట్ సిటి పనులకోసం రూ.1000 కోట్లు అభివృద్ధి పనులు తీసుకచ్చిన అన్నారు. మళ్లీ కరీంనగర్ ఎంపీగా గెలిపిస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి యాలని ఉందన్నారు.…
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేశారు. అయితే.. యనమల కృష్ణుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.. ఈ నెల 27న యనమల కృష్ణుడు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు.. మరోవైపు ఈ రోజు వైసీపీ…
పవర్ ప్రాజెక్టుల ద్వారా అంతులేనంత పైసలు – భూములు దోపిడీ జరుగుతుందని ఏపీ బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ఇవాళ ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో అపరిమిత “యాక్సిస్”, ఇండోసోల్ ఆయన “సోల్” అని ఆయన అన్నారు. యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 774.90 మెగావాట్ల పీపీఏ ప్రతిపాదనలను ఈఆర్సీ తిరస్కరించడాన్ని ఆహ్వానిస్తున్నామని, 774.90 మెగావాట్ల పీపీఏ రద్దు చేసినందున రాష్ట్రానికి 7300…