కంబోడియాలో పశ్చిమ ప్రాంతంలోని సైనిక స్థావరం వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన పేలుడులో 20 మంది సైనికులు మరణించారని, పలువురు గాయపడ్డారని కంబోడియా ప్రధాని హున్ మానెట్ తెలిపారు. కంపాంగ్ స్పీ ప్రావిన్స్‌లోని సైనిక స్థావరంలో జరిగిన పేలుడు గురించి తెలుసుకుని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మానెట్ ఫేస్బుక్లో ఒక పోస్ట్‌లో తెలిపారు.
పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే పోరాడి తెలంగాణ సాధించా తెలంగాణ కోసం పోరాడితే ఖమ్మం జైల్ లో వేశారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలో కి కాంగ్రెస్ అని ఆయన అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పాలమూరు జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాలే నేను వచ్చినంక ఐదు మెడికల్ కాలేజీలు తెచ్చానని, రైతులకు నేటికీ రైతు బంధు రాలేదు, రెండు లక్షల…
600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే.. చంద్రబాబు 160 సీట్లు వస్తాయని పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. గెలిచే అవకాశం లేదని టీడీపీ నాయకులకు కూడా తెలుసన్నారు. 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన విమర్శలు గుప్పించారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో రీజనల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆయన..…
రోజువారీ రైల్వే ప్రయాణికుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని రైల్వే వందే మెట్రో రైలును నడపనుంది. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మెట్రో మార్గంలో నడిచే ఈ రైళ్లు మొదటి దశలో దేశంలోని 124 నగరాలను కలుపుతాయి. జూలై నుంచి తొలి వందే మెట్రో రైలు పట్టాలపై నడుస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
రేవంత్ రెడ్డి మతిస్థిమితం కొల్పోయాడా…. గజినిగా మారాడా అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త అంశాలను తెరమీదకు తీసుకు వస్తున్నారని, కాళేశ్వరం పోయింది పోన్ ట్యాపింగ్ వచ్చింది… పోన్ ట్యాపింగ్ పోయి మరో అంశం తెరపైకి తెచ్చారన్నారు మహేశ్వర్ రెడ్డి. రెఫరెండం అన్నావు 14 సీట్లు గెలుస్తామని అన్నావు… 14 గెలిస్తే నేను రాజీనామా చేస్తా అన్న మీరు స్పందించలేదని, రేవంత్ రెడ్డి, హరీష్ రావు లు కలిసి…
లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మాదిగలు అందరూ కృషి చేస్తారని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పాపయ్య మాదిగ అన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ కూడా కేటాయించలేదని… ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటి అయ్యి చర్చించామని పాపయ్య మాదిగ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
తాను డబ్బులు తీసుకొని ఏ ఒక్క ప్రెస్‌మీట్ పెట్టలేదని వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి పేర్కొన్నారు. కావాలంటే నార్కో టెస్ట్ నిర్వహించండి అంటూ ఆయన సవాల్ విసిరారు. ఎఫ్డీసీ ఛైర్మన్ అవ్వకముందు నుంచే ప్రెస్మీట్లు పెట్టానన్నారు. గత 15 ఏళ్లుగా ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నానన్నారు. పెయిడ్‌గా ఒక్క ప్రెస్‌మీట్ పెట్టినా వేరే దేశానికి వెళ్లిపోతానన్నారు.
భారత్‌కు చిన్న ఆయుధాలను విక్రయించడంపై ఉన్న నిషేధాన్ని జర్మనీ తాజాగా ఎత్తివేసింది. ఈ చర్య రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, సైనిక సంబంధాలను బలోపేతం చేయడానికి సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ మేరకు శుక్రవారం వర్గాలు వెల్లడించాయి. గతంలో, జర్మనీ నాటోయేతర దేశాలకు చిన్న ఆయుధాలను విక్రయించడాన్ని నిషేధించింది.