సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అయిపోగానే మహిళలకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తామని ఆయన వెల్లడించారు. మొదటి ప్రాధాన్యంగా ప్రతి రోజూ నేను రివ్యూ చేసే అంశం గౌరవెల్లి ప్రాజెక్టు అని, ఇరిగేషన్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడమే నా లక్ష్యమన్నారు మంత్రి పొన్నం. కరీంనగర్ కు మెడికల్ కాలేజ్ ఇస్తామని గతంలో అప్పటి ముఖ్యమంత్రి హామీ ఇచ్చి తొమ్మిది ఏండ్లు అయిన ఇవ్వలేదని, హుస్నాబాద్ కు మెడికల్ కాలేజీ కావాలంటే హుస్నాబాద్ లో 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కావాల్సిందేనన్నారు పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని 250 పడుకలకు పెంచి, మెడికల్ కాలేజీ తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు.
అంతేకాకుండా..బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ హుస్నాబాద్ కు వెంట్రుక మందం పని చెయ్యలేదని, పేగు బంధం తెంచుకొని పుట్టిన బిడ్డ నర్స్ చెప్పితే తెలుస్తుందని బండి సంజయ్ అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ హయంలోనే మన దేశం నుండి జంతు మాంసం ఎక్కువగా ఎగుమతి అవుతుందని ఆయన మండిపడ్డారు. బతికున్న తన తల్లిని చనిపోయిందని, బిడ్డ జన్మ గురించి అవమానకరంగా మాట్లాడిన బండి సంజయ్ కి ఓటు వేస్తారా అమ్మలు అక్కలు ఆలోచించాలన్నారు. తెలంగాణ సాధన కోసం నేను కొట్లడిన, పార్లమెంట్ లో తెలంగాణ ఏర్పాటును కించపరిచే విధంగా ప్రధాని మాట్లాడిన బండి సంజయ్ నోరు మెదపలేదని మంత్రి పొన్నం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రావును గెలిపించాలని ప్రజలను కోరుతున్నానని, బీజేపీ, బిఆర్ఎస్ లు తమ ప్రభుత్వాన్ని కూల కొడతామని అంటున్నాయి, దమ్ముంటే ఓసారి తమ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండని ఆయన అన్నారు.