CM Revanth Reddy : చేవెళ్ల ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లాలోని తాండూరు లో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి ప్రియాంక గాంధీ వచ్చారని, ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయని అన్నారు. వికారాబాద్ జిల్లాలో ఎన్ని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుందని, వికారాబాద్ జిల్లా కు ముఖ్యమంత్రి పదవి, స్పీకర్ పదవి దక్కిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చేవెళ్ల ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలని ఆయన కోరారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ను తీసుకువచ్చారని, వికారాబాద్ ప్రాంతానికి రావాల్సిన గోదావరి జలాలు రద్దు చేసి కేసీఆర్ ఎడారిగా మార్చాడని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ చేసిన అన్యాయం వల్ల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రాలేదని, పాలమూరు రంగారెడ్డికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని సీఎం రేవంత్ అన్నారు. పాలమూరు రంగారెడ్డికి బీజేపీ ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వలేదని, కందులకు సరైన మద్దతు ధర రాకపోవడానికి కారణం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. వికారాబాద్ కు ఎంఎంటీఎస్ రైలు రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’వికారాబాద్ శాటీ లైైట్ సిటీ ఆగిపోయింది.. మురికి కూపంలా తయారైన మూసీ బాగుపడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.. రైతు బంధు నిధులు ఇస్తే కేసీఆర్ అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయాలని సవాల్ చేశా… రైతు బంధు నిధులు 7 వ తేదీన వేశాను… కేసీఆర్ నీకు ఏ మాత్రం సోయి ఉన్నా ముక్కు నేలకు రాయి.. అనంతగిరి కొండల్లో పద్మనాభుని సాక్షిగా ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా.. రైతు రుణం తీర్చుకోకపోతే ఈ ముఖ్యమంత్రి పదవి నిష్ప్రయోజనం.. రైతు ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదే.. సంక్రాంతి పండుగ కు గంగిరెద్దులా మోదీ, అమిత్ షా తెలంగాణ కు రోజూ వస్తున్నారు.. బయ్యారం ఉక్కు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ కారిడార్, మెట్రో రైలు, ఐటీ కంపెనీలను రాష్ట్ర విభజన సమయంలో సోనియమ్మ రాష్ట్రానికి ఇచ్చింది.. తెలంగాణ కు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీ కి కర్రు కాల్చి వాత పెట్టాలి.. తెలంగాణ బీజేపీ ఇచ్చింది, మోదీ తెచ్చింది గాడిద గుడ్డు.. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, ఎల్లమ్మ,పోచమ్మ పండుగ లు మనం చేయలేదా.. దేవుడి పేరు మీద విభజించాలని బీజేపీ చూస్తోంది.. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ..వారే అసలైన హిందువులు.. దేవుడి పేరు మీద ఓట్లు భిక్షమెత్తుకునే వారు హిందూ ద్రోహి…. చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి కి లక్ష ఓట్ల మెజారిటీ ఇవ్వాలి..’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!