పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో గురువారం వేర్వేరు చోట్ల పిడుగులు పడి 12 మంది మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. మృతుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు చెప్పారు. మరోవైపు.. హరిశ్చంద్రాపూర్‌లో పిడుగుపాటుకు దంపతులు మృతి చెందారు. పొలంలో పనిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా.. పిడుగుపాటుకు గురై మృతి చెందిన.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని జిల్లా మేజిస్ట్రేట్ నితిన్ సింఘానియా ప్రకటించారు. పిడుగుపాటుకు మృతి చెందిన వారికి విపత్తు నిధి నుంచి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఇస్తామని తెలిపారు. అన్ని రకాల ప్రభుత్వ సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు.
Match Fixing: లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్.. ఇద్దరు ఇండియన్స్ పాస్పోర్ట్ సీజ్
గురువారం మధ్యాహ్నం మాల్దాలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో.. పిడుగుపాటుకు ఓల్డ్ మాల్డాలోని సహపూర్‌లో మైనర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. మృతులు చందన్ సాహ్ని (40), మనోజిత్ మండల్ (21), రాజ్ మృధ (16)గా గుర్తించారు. గాలి ధుమారానికి మామిడికాయలు రాలిపోతే.. వాటిని తీసుకొస్తున్న క్రమంలో మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. మరోవైపు.. గజోల్‌లోని ఆదినాలో పిడుగుపాటుకు ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. మానిక్‌చక్ బ్లాక్‌లో ఇద్దరు మైనర్లు, ఒక వృద్ధుడు పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. మృతులు షేక్ సబ్రుల్ (11), రాణా షేక్ (11), అతుల్ మండల్ (65)గా గుర్తించారు.
Off The Record: కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న పోలింగ్ తరువాత లెక్కలు..!
హరిశ్చంద్రాపూర్‌లో కూడా పిడుగుపాటుకు దంపతులు మృతి చెందారు. నయన్ రాయ్ (23), ప్రియాంక సింగ్ (20) తూర్పు కుస్తారియా గ్రామంలో జనపనార తోటలో పని చేస్తూ ఉండగా పిడుగుపాటుకు మరణించారు. మరోవైపు.. అంగ్రేజ్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యవసాయ భూమిలో పని చేస్తుండగా పిడుగుపాటుకు పంకజ్ మండల్ (23) అనే వ్యక్తి మృతి చెందాడు. పిడుగుపాటు ఘటనలో వధువు సహా మరో ఇద్దరికి గాయాలయ్యాయి.