సీజనల్ ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తెలుసు. వేసవి కాలం మండే సూర్యుడిని మాత్రమే కాకుండా అనేక అద్భుతమైన పండ్లను కూడా తీసుకువస్తుంది. ఈ రోజుల్లో ఫాల్సా పండ్లు మార్కెట్లో ఎక్కువగా విక్రయించబడడాన్ని మీరు చూసే ఉంటారు.
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న మూడు ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకులతో సీఎం సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో దృష్టి సారించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 34 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా అందులో 33 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్ర…
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో 65.67 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా భువనగిరి 76.78 శాతం, అత్యల్పంగా.. హైదరాబాద్ 48.48 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్పారు. తెలంగాణలో 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2019లో రాష్ట్రంలో 62.77 శాతం ఓటింగ్ నమోదైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గంలో 50.34% ఓటింగ్ నమోదైంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లకు 209 లక్ష్యాన్ని ముందు ఉంచారు. కాగా.. ఢిల్లీ బ్యాటింగ్ లో అభిషేక్ పోరెల్ (58), ట్రిస్టన్ స్టబ్స్ (57*) పరుగులతో రాణించడంతో ఢిల్లీ భారీగా స్కోరు చేయగలిగింది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ 33 బంతుల్లో 58 పరుగులు చేయగా.. అతని…
మన శరీరం మన ఆరోగ్యానికి ప్రతిరూపం. శరీరంలో కనిపించే లక్షణాల సహాయంతో మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది తేలికగా అంచనా వేసుకోవచ్చు. మన ముఖం నుంచి కళ్ళ వరకు అన్నింటి సహాయంతో మన ఆరోగ్యాన్ని ట్రాక్ చేయవచ్చు.
రైలు ప్రయాణం చేసేటప్పుడు తమతో పాటు తమ లగేజీలను బ్యాగ్ లలో తీసుకువెళతారు. అయితే.. అందులో ఏముంటుందన్న విషయం పక్కన కూర్చే వారికి తెలియదు. కానీ.. స్మగ్లర్లు రైలు ప్రయాణం ద్వారానే.. కోట్లాది విలువ చేసే డ్రగ్స్ ను రాష్ట్రాలు దాటిస్తున్నారు. సమాచారం అందితే దొరికేవి కొన్నైతే.. దొరకనివి చాలా ఉన్నాయి. తరుచూ మనం చూస్తూనే ఉంటాం.. రైళ్లలో డ్రగ్స్ తరలిస్తున్నారని.. పట్టుబడ్డారన్న వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ముఖ్యమంత్రి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అవుతుందని మాట్లాడేటోడికి.. మెదడు తక్కువ ఉన్నట్టు ఉందని దుయ్యబట్టారు. అది ఎప్పుడు చేస్తారో తెలియదు.. కేంద్రపాలిత ప్రాంతం అనేదే ఉండదన్నారు. కేటీఆర్ మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడని తీవ్ర విమర్శలు చేశారు. సెకండ్ క్యాపిటల్ చేయండి అని కేటీఆర్ డిమాండ్ చేశాడు కదా అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసినా అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. మంగళవారం తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపటి నుండి పరిపాలన మీద దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రుణమాఫీ పై ఫోకస్, విద్యాశాఖ మీద ఫోకస్, అన్ని హస్టల్స్ కి సన్న బియ్యం.. బీఆర్ఎస్ ఇచ్చిన సన్న బియ్యం కాదు.. నిజమైన సన్నబియ్యం ఇస్తామని అన్నారు. త్వరలో బ్యాంకర్ల సమావేశం ఉంటుందన్నారు. రుణమాఫీ పై చర్యలు, రైతుల రుణాలు ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతుల రుణాలు మాఫీ కోసం…