ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. మధ్యాహ్నం నుంచి హైదరాబాద్లో భారీ వర్షం కురిసినప్పటికీ.. ఉప్పల్ స్టేడియం స్టేడియం పరిసరాల్లో ఇంకా వర్షం పడుతూనే ఉంది. కొద్దిసేపు వర్షం ఆగినప్పటికీ.. మళ్లీ కురుస్తూనే ఉంది. దీంతో.. ఉప్పల్ స్టేడియంలో ఔట్ ఫీల్డ్లో వర్షం నీరు ఇంకా నిలిచి ఉంది. ఔట్ ఫీల్డ్లో నీళ్ళు పూర్తిగా పోవాలంటే సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు.. మ్యాచ్ రద్దు అయితే ఒక పాయింట్ పొంది సన్ రైజర్స్ హైదరాబాద్ నేరుగా ప్లే ఆఫ్ వెళ్లనుంది. వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే.. గుజరాత్, హైదరాబాద్ కి చెరో పాయింట్ వస్తుంది. దీంతో.. 15 పాయింట్లతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు వెళ్లనుంది.
Read Also: Swati Maliwal: తనపై జరిగిన దాడి గురించి తొలిసారి స్పందించిన స్వాతి మలివాల్.. ఏమన్నారంటే..?
ఉప్పల్ స్టేడియం వద్ద ఇంకా వర్షం కురుస్తుండంటంతో మ్యాచ్ జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో.. సన్ రైజర్స్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. మ్యాచ్ జరగడం కష్టమేనని స్టేడియం నుంచి కొందరు వెళ్లిపోతున్నారు. కాగా.. మరోసారి వర్షం ఆగితే పిచ్ ను 10.30కి మరోసారి పరిశీలించనున్నారు ఎంపైర్లు, కెప్టెన్లు. వర్షం పూర్తిగా తగ్గితే.. 5 ఓవర్ల మ్యాచ్ జరుగుతుంది. అప్పటికీ వర్షం కురిస్తే… మ్యాచ్ పూర్తిగా రద్దు కానుంది. ఈ క్రమంలో.. రెండు టీమ్స్ కి చెరో పాయింట్ యాడ్ అవుతుంది. కాగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ నేరుగా ప్లే ఆఫ్స్ చేరుకోనుంది.
Read Also: Mumbai: ముంబైలో హోర్డింగ్ కూలిన ఘటన.. కారులో భార్యాభర్తల మృతదేహాలు గుర్తింపు