కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఏమేం సిఫారసులున్నాయి.. ప్రభుత్వం తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. శనివారం సాయంత్రం సచివాలయంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆయన చర్చలు జరిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సీఎం వెంట ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ…
మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్‌లో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారతదేశాన్ని మోడీ నిలిపారన్నారు. 400 సీట్లు NDA కు వచ్చే వాతావరణం ఉందని, మంచి మెజార్టీతో ఎంపీగా ఆరూరి రమేష్ గెలవబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో కూడా బీజేపీ బలపడాల్సిన అవసరం ఉందని, తెలంగాణలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అని కిషన్ రెడ్డి అన్నారు. హమీలు నెరవేర్చలేని…
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క ట్రాన్స్ జెండర్ ఐకాన్ మాయా ఠాకూర్ తన జీవితంలో పడ్డ కష్టాలను గురించి తెలిపింది. తొమ్మిదో తరగతి తర్వాత బలవంతంగా చదువు మానేయాల్సి వచ్చింది. కాగా.. మాయ ఇప్పుడు ట్రాన్స్‌జెండర్ ఐకాన్‌గా మారింది. స్కూల్లో చదువుకునే రోజుల్లో విద్యార్థులు, టీచర్ల నుంచి తాను ఏకపక్ష ప్రవర్తనను ఎదుర్కొన్నానని ట్రాన్స్‌జెండర్ ఐకాన్ తెలిపింది. దీంతో.. ఆమె పాఠశాల విద్యను పూర్తి చేయలేకపోయిందని చెప్పింది. సిమ్లా పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని సోలన్…
ఐపీఎల్ 2024లో భాగంగా.. లీగ్ దశలో చివరి మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన సీఎస్కే.. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. రాత్రి 7.30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఉద్యోగం ఆశ చూపించి మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నట్లు వారు తెలిపారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమ ఆకాంక్షలను రాష్ట్ర నామకరణం ప్రతిబింబించేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. విధాన పత్రాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, నోటిఫికేషన్లు, సర్క్యులర్లు, నివేదికలు , ఇతర కమ్యూనికేషన్ మెటీరియల్‌లతో సహా అన్ని అధికారిక పత్రాలు ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయాల యొక్క అన్ని అధికారిక కమ్యూనికేషన్లలో TSకి బదులుగా TG నామకరణాన్ని ఉపయోగిస్తాయి. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర సంస్థలు, స్వయంప్రతిపత్త సంస్థలు…
ఆఫ్ఘనిస్థాన్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు అక్కడి మీడియా కథనాలు తెలుపుతున్నాయి. పశ్చిమ ఆఫ్ఘనిస్థాన్‌లోని ఘోర్ ప్రావిన్స్‌లో కుండపోత వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరదలలో సుమారు 68 మంది చనిపోగా.. పదుల సంఖ్యలో ప్రజలు వరదలో గల్లంతైనట్లు సమాచారం. ప్రాథమిక నివేదికల ఆధారంగా మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు తాలిబన్ అధికారి ఒకరు శనివారం తెలిపారు. వరదల కారణంగా జిల్లా భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసిందని..…
జీవనోపాధిలో భాగంగా రోజు లాగానే ఇంటి నుండి బయలుదేరిన గౌడన్న ఊరికి సమీపంలోని తన తాటి చెట్టు పైకి చక చకా ఎక్కాడు. అక్కడ కాస్తా కాలుకున్న మోకు అదుపుతప్పడంతో భయంతో అక్కడే ఉండిపోయాడు. ప్రాణాలు అరచేత పెట్టుకొని ఉన్న అతడిని కింద ఉన్న గౌడన్నలు గమనించి చకచకా ఎక్కి చాకచక్యంగా అతన్ని కిందికి తీసుకువచ్చారు. అన్ని చెబుతున్న గాని అసలు విషయం మర్చిపోయాను అనుకునేరు… ఇదంతా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో జరిగింది.…
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా గౌతమి గోదావరిలో స్నానానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. మరో ఇద్దరు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.