Delhi: ప్రైవేట్ భాగాలను బైక్‌తో తొక్కించి.. చేతులు, కాళ్లు కట్టి యువకుడి నోటిలో మూత్ర విసర్జన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఉత్తమ్ నగర్ ప్రాంతంలోని శివ్ విహార్‌లో డ్రగ్స్ దందా చేస్తున్న ముఠా శనివారం రాత్రి ఓ యువకుడిని కిరాతకంగా కొట్టి చంపారు. అంతకు ముందు యువకుడిని చిత్రహింసలు పెట్టారు. అతని ప్రైవేట్ భాగాలను బైక్‌తో తొక్కించి.. కారం చల్లారు. ఆ యువకుడు నొప్పితో కేకలు వేస్తుండటంతో చేతులు, కాళ్లు కట్టి నోటిలో మూత్ర విసర్జన చేశారు నిందితులు. ఈ క్రూర ఘటన ఓ వీధిలో జరిగింది. అయితే.. ఆ యువకుడిని రక్షించడానికి ఎవరూ ప్రయత్నించలేదు. యువకుడు శివ విహార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. యువకుడి స్వస్థలం మధ్యప్రదేశ్ ఛతర్‌పూర్ జిల్లాలోని రాగోలి. కాగా.. ఈ ఘటనలో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితులు నైనా అలియాస్ మీనా, రోహిత్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ క్రాష్.. హర్డ్ ల్యాండింగ్ అయినట్లు అనుమానం..
Also Read
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
వివరాల్లోకి వెళ్తే.. యువకుడు కరణ్ మానసికంగా బాధపడుతున్నట్లు అతని సోదరుడు నిశాంత్ తెలిపాడు. కరణ్ కు ఊరికనే కోపం వస్తుందని, ఈ క్రమంలో అనేక మందితో చాలాసార్లు గొడవ పడేవాడని చెప్పాడు. ఈ క్రమంలో.. కొన్ని నెలల క్రితం ఆ ప్రాంతంలో చిరుధాన్యాలు అమ్మే మహిళ మీనాతో గొడవ పడ్డాడు. దీంతో.. అతనిపై రెండు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కాగా.. యువకుడిని తన స్వగ్రామానికి పంపించారు. అయితే.. అతని కేసు కోర్టులో ఉంది కావున.. ఇటీవల కరణ్‌ను ఉత్తమ్ నగర్‌కు పిలిచారు. ఈ సమయంలో కరణ్ ఇక్కడికి వచ్చాడని మీనాకు తెలిసింది.
KTR : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఇరు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలి
ఈ క్రమంలో.. శనివారం రాత్రి కరణ్ ఇంట్లో ఉన్న సమయంలో మీనా డజను మందితో కర్రలు, కత్తులతో అక్కడికి వచ్చారు. ఉన్నట్టుండి కరణ్‌పై దాడికి దిగారు. కరణ్‌ని రక్షించడానికి ఇరుగుపొరుగువారు కూడా సాహసించకపోవడంతో వారు అతన్ని తీవ్రంగా కొట్టారు. మధ్యలో ఎవరైనా వస్తే ఇలాగే చంపేస్తామని నిందితులు బెదిరించారు. కరణ్‌ను మొదట కొట్టి, ఆపై అతని ప్రైవేట్ భాగాలపై బుల్లెట్ బైక్‌తో తొక్కించారు. అంతేకాకుండా గాయాలపై ఉప్పు, కారం చల్లారు. తర్వాత చేతులు, కాళ్లు కట్టేసి నోటిలో మూత్రం పోశారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కరణ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా.. అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ కేసులో మీనా, రోహిత్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. విచారణలో మీనా ఆరు నెలల క్రితం తన ఇంట్లో మొబైల్, ఇతర వస్తువులను దొంగిలించాడని చెప్పింది. దీంతో అతడిని కొట్టామని పేర్కొంది.
- Tags
- Atrocity
- death
- Delhi
- telugu news
- urin
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!