ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 27 పరుగుల తేడాతో గెలుపొందింది. 219 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. దీంతో చెన్నై ఓడిపోయింది. ఈ క్రమంలో.. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది. చెన్నై బ్యాటింగ్‌లో చివర్లో జడేజా (42*) పరుగులతో ఆదుకున్నప్పటికీ చివరికి ఓటమిపాలైంది. ధోనీ కూడా (25) పరుగులతో రాణించాడు.
వెల్లుల్లి ఆహారం రుచిని పెంచడమే కాకుండా దానిని పురాతన కాలం నుంచి ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అయితే వెల్లుల్లి తొక్కలను మీరు పనికిరావని భావించి పారేస్తున్నారా.. ఇక నుంచి తెలుసుకోండి వెల్లుల్లి లాగానే వెల్లుల్లి తొక్కలతో కూడా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లి పీల్స్‌లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ-వైరస్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని సూప్‌లు, కూరగాయలలో వాడవచ్చు. వెల్లుల్లి తొక్కల వల్ల ఉబ్బసం, పాదాలలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి.…
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నైతో జరుగుతున్న కీలక మ్యాచ్ లో ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది బెంగళూరు. చెన్నై ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే 219 పరుగుల టార్గెట్ ను చేధించాలి. బెంగళూరు బ్యాటింగ్ లో అందరూ సమిష్టిగా రాణించారు. ఆర్సీబీ ఓపెనర్లలో విరాట్ కోహ్లీ (47), డుప్లెసిస్ (54) పరుగులతో శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత.. రజత్ పటిదార్ (41) పరుగులతో చెలరేగాడు.…
విశాఖపట్నంలో ఓ మందుబాబు హల్చల్ చేశాడు. ట్రాఫిక్ పోలీసులపై మందుబాబు వీరంగం సృష్టించాడు. విశాఖలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా ఇద్దరు స్నేహితులు తాగి బండిపై వచ్చారు. వారిలో ఓ వ్యక్తి అక్కడి నుంచి పరారీ కాగా.. మరో వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.
ఇటీవల తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తప్పుపట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో.. ఆమె బీఆర్ఎస్కు మద్దతుగా మాట్లాడారని.. మళ్లీ విజయశాంతి పార్టీమారుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. దీనిపై తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చారు. దక్షిణ భారత ప్రాంత ప్రజల రాజకీయ భావోద్వేగాలు ఎలా ఉంటాయో… గత, ఇప్పటి పరిస్థితులను ఉదహరించి తాను ట్వీట్ చేసినట్లు తెలిపారు. దక్షిణాది ప్రాంతీయ పార్టీల పట్ల కాంగ్రెస్…
నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు అక్కడికక్కడే మృతి కూటి కోసం, కూలీ కోసం రాష్ట్రానికి వచ్చిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. గోడ కూలి ఇద్దరు మరణించారు. దీంతో వారి కుటుంబాలు దిక్కులేనివయ్యాయి. అనంతపురం జిల్లా కూడేరు మండలం గొటుకూరు దగ్గర నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ఆర్చ్ నిర్మాణం కోసం పిల్లర్లు వేస్తుండగా ఒక్కసారిగా కప్పు…
కడప జిల్లా జమ్మలమడుగులో పరిస్థితులను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సమీక్షించారు. ఎన్నికల రోజు పోలీసుల పనితీరు భేష్ అంటూ ఆయన ప్రశంసించారు. జమ్మలమడుగులో ఎన్నికల రోజు తలెత్తిన వివాదాలను పోలీసులు చాకచక్యంగా అణిచివేశారని.. పోలీసులు ప్రాణాలకు తెగించి చాలెంజింగ్‌గా పరిస్థితులను అదుపు చేశారని చెప్పుకొచ్చారు.
రోజురోజుకు కేటుగాళ్లు ముదిరిపోతున్నారు. ఏకంగా.. ఎంపీలు, ఎమ్మెల్యేలను బురిడీ కొట్టిస్తున్నాడో కేటుగాడు… ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరీ గా పరిచయం చేసుకుంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఫోన్ కాల్స్ చేయడం మొదలెట్టాడు. ప్రభుత్వం కొత్తగా లోన్ స్కీం తెస్తోందని.. 100 మంది సభ్యులకు లోన్లు అందించబోతోందని చెప్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. లోన్ మంజూరు కావాలంటే ఒక్కో వ్యక్తి కి 3600 చొప్పున 3 లక్షల 60 వేలు తాను చెప్పిన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పిన మోసగాడు..…
ఏపీలో ఎన్నికల సమయంలో, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. కంటైనర్లు, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దని పెట్రోల్ బంక్ నిర్వాహకులను ఎన్నికల సంఘం ఆదేశించింది.