ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రెండు మ్యాచ్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్.. భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు సాధించారు. పంజాబ్ బ్యాటింగ్లో అత్యధికంగా ప్రభ్సిమ్రాన్ సింగ్ (71) పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 4 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత అథ్వారా థైడే (46), రిలీ రోసో (49) పరుగులతో రాణించారు.
Read Also: SIT Investigation on Violence: అనంతపురం, పల్నాడులో దర్యాప్తు ముమ్మరం
శశాంక్ సింగ్ (2), జితేష్ శర్మ (32*), అశుతోష్ శర్మ (2), శివం సింగ్ (2*) పరుగులు చేశారు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో నటరాజన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత కమిన్స్, విజయ్ కాంత్ వియస్కాంత్ తలో వికెట్ సాధించారు. కాగా.. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకుతుంది.
Read Also: SIT Investigation on Violence: తిరుపతిలో విచారణ వేగం పెంచిన సిట్.. రాత్రి వరకు పూర్తయ్యే అవకాశం