ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరుగనుంది. గుహవాటిలోని బర్సాపరా స్టేడియంలో ఈ మ్యాచ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సింది. కానీ.. అక్కడ వర్షం పడుతుండటంతో ఇంకా టాస్ కూడా వేయలేదు. కాగా.. పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. టాస్కు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ రాజస్థాన్కు అత్యంత కీలకం. ఎందుకంటే.. రాజస్థాన్ ఇప్పటి వరకూ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగగా.. ఇప్పుడు మూడవ స్థానానికి పడిపోయారు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. దీంతో.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుని రాజస్థాన్ను కిందకు దించింది.
Read Also: SRH vs PBKS: పంజాబ్ పై సన్రైజర్స్ విజయం.. రెండో స్థానానికి హైదరాబాద్
కాగా.. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ పై విజయం సాధిస్తే.. యధావిధిగా రెండో స్థానానికి వెళ్లనుంది. అయితే.. సెమీస్లో రెండో స్థానంలో ఉండే టీమ్కు మ్యాచ్లు ఆడే అవకాశాలు రెండు ఉంటాయి. అదే 3, 4వ స్థానంలో ఉండే జట్లకు ఒక మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్లో ఓడిపోతే నేరుగా ఇంటికి వెళ్లిపోవాల్సిందే. అదే మొదటి, రెండో స్థానంలో ఉన్న జట్లకు రెండు మ్యాచ్లు ఆడే ఛాన్స్ ఉంటుంది.
Read Also: Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో కీలక మార్పులు.. అవేవో చూడండి