Yadadri Dress Code: తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఇప్పుడు డ్రెస్ కోడ్ తప్పనిసరి. నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది.
హమాస్‌పై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధానిని రెండు వైపులా చుట్టుముట్టారు. ఓ వైపు రఫాలో ఆపరేషన్ ప్రారంభించడంతో అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు గాజా విషయంలో నెతన్యాహుతో సొంత ప్రభుత్వ మంత్రులే విరుచుకుపడుతున్నారు.
Triple Talaq Case: 2019లో ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఆదిలాబాద్ జిల్లాలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదైనట్లు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
పోలింగ్ అనంతర అల్లర్లపై సిట్ విచారణ నేడు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిన్నటి నుంచే సిట్ రంగంలోకి దిగింది. తాడిపత్రి, నరసరావు పేట, తిరుపతిలో శనివారం నుంచే సిట్ టీమ్ విచారిస్తోంది. ఇప్పటికే అల్లర్లపై నమోదైన కేసులను సిట్ బృందం పరిశీలించింది.
ఆ తల్లి నవమాసాలు బిడ్డను కడుపులో మోసింది. పురుటి నొప్పులను భరించి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ ముక్కుపచ్చలారని పసికందు పుట్టిన కాసేపటికే చెరువులో విగతజీవిగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి సమీపంలోని చెరువులో పురిటి బిడ్డ మృతదేహం లభ్యమైంది.
గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం అనేది మహిళల జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం. ఈ మాత్రలు వేసుకుంటే గర్భం రాకుండా ఉండటమే కాదు, హార్మోన్లలో మార్పులను కూడా ప్రేరేపిస్తుందట. ఈ మాత్రను శరీరం లోపలికి వెళ్లి గర్భం రాని విధంగా హార్మోన్లలో మార్పులు తీసుకొచ్చే విధంగా తయారు చేస్తారు. శరీరం లోపల జరిగే ఈ మార్పులను నిర్వహించడం కొంతమంది స్త్రీలకు చాలా కష్టంగా ఉంటుంది. వారు మానసికంగా చితికిపోతారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కనిగిరి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా.. 10 మందికి గాయాలయ్యాయి.
ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై 13 మంది సభ్యులతో కూడిన సిట్ బృందం విచారణ కొనసాగుతోంది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరించిన అధికారుల తీరుపై విచారిస్తోంది.