వ్యవసాయం, వ్యవసాయేతర భూములు, ఆస్తులకు ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ఇది ఆదాయాన్ని పెంచడానికి భూముల మార్కెట్ విలువను సవరించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించింది. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం ఇదే తొలిసారి. స్టాంప్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ ప్రస్తుత విలువను అధ్యయనం చేయడానికి మరియు తదనుగుణంగా కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను నిర్ణయించడానికి దాన్ని సవరించడానికి కార్యాచరణ…
దేవాదాయ శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ రాజీనామా చేశారు. రిటైరైన తర్వాత సర్వీసులో కొనసాగనిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మరో నెలన్నర పదవీ కాలం ఉండగానే కరికాల వలవన్ రాజీనామా చేశారు.
అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. మూడు వారాల్లో అన్న క్యాంటీన్లని ప్రారంభించేలా కార్యాచరణకు మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఇప్పుడు కూడా గతంలో మాదిరిగా రూ. 5కే అన్న క్యాంటీన్లల్లో భోజనం, టిఫిన్లు ఏర్పాటు చేస్తామన్నారు. 203 అన్న క్యాంటీన్లకు గత టీడీపీ ప్రభుత్వం అనుమతించిందని, వీటిలో చాలా వరకు భవనాల నిర్మాణం జరిగిందన్నారు.
ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రిగా సత్య కుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య సత్య కుమార్ బాధ్యతల స్వీకరించారు. రాష్ట్రంలో 5.30 కోట్ల మందికి కేన్సర్ స్క్రీనింగ్ ఫైలుపై సంతకం చేశానని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కేన్సర్‌ను ముందస్తుగా గుర్తించి వైద్యం అందించేందుకు నివారణ, అవగాహన చర్యలు తీసుకుంటామన్నారు.
ఏపీ మంత్రి నారా లోకేశ్ తనను గెలిపించిన మంగళగిరి ప్రజలకు మంచి చేసేందుకు రంగంలోకి దిగారు. శనివారం మంగళగిరి ఎమ్మెల్యేగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 'ప్రజా దర్బార్' ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి.. రెండో రోజూ ఆదివారం కూడా ప్రజా దర్బార్‌ను మంత్రి నారా లోకేష్ నిర్వహించారు.
మున్సిపల్ శాఖలో ముఖ్యమైంది అమరావతేనని.. రెండున్నరేళ్లలో అమరావతిలో కీలకమైన నిర్మాణాలు, పనులు పూర్తి చేస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు. సెక్రటేరియట్,అసెంబ్లీ, అధికారులు, ఉద్యోగుల ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళ్తామన్నారు.
టీ20 వరల్డ్‌కప్‌లో ఆదివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ట్రావిస్ హెడ్, మార్కస్ స్టొయినీస్ రాణించడంతో ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా విజయంతో ఇంగ్లండ్‌కు సూపర్-8 టిక్కెట్ లభించింది. అక్కడ, స్కాట్లాండ్ ప్రయాణం ముగిసింది.
ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. మేళతాళాలతో మంత్రి నారాయణ తన ఛాంబర్లోకి వచ్చారు. 2014-19 మధ్య కాలంలో మంత్రిగా ఏ ఛాంబర్లో విధులు నిర్వహించారో.. అదే ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు.
ఒకప్పుడు రూ.250 జీతానికి పనిచేసిన వ్యక్తి నేడు కష్టపడి కోటీశ్వరుడయ్యాడు. జీవితంలో చిత్తశుద్ధితో పనిచేస్తేనే గొప్ప విజయం సాధించవచ్చు. ప్రపంచంలో అపజయానికి భయపడని వ్యక్తులు చాలా తక్కువ. ఈ వ్యక్తులు తమ వైఫల్యాన్ని ముందుకు సాగడానికి సాధనంగా చేసుకుంటారు. మురళీ దివి కూడా అలాంటిదే చేశారు.