Crime News: మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కీచకులు చిన్నా, పెద్దా తేడాలేకుండా తమ పశువాంఛ తీర్చుకుంటున్నారు. ప్రతిరోజు ఏదో ఒక మూల.. ఎక్కడో ఒకచోట బాలికలు, మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతూనే ఉన్నారు. చిన్నారులు, యువతులు, మహిళలు ఒంటరిగా కనపడితే చాలు.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా అల్లూరి జిల్లా పాడేరులో ఓ ఆరేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also: Student Suicide: మొబైల్‌లో గేమ్స్ ఆడొద్దన్నందుకు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఆరేళ్ల చిన్నారిపై ఆగంతకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతరలో చిన్నారిపై యువకుడు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. కామాంధుడి చేష్టలతో అభం, శుభం తెలియని ఆ చిన్నారి నీరసంగా ఉండటంతో అనుమానించిన తల్లి విచారించగా.. అసలు విషయం వెలుగు చూసింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో చట్టం కింద అల్లూరి జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించారు.అతనిపై పోక్సో కేసు నమోదైందని, కఠిన శిక్ష పడుతుందని ఏఎస్పీ తెలిపారు.