భారత మహిళల క్రికెట్ జట్టు, దక్షిణాఫ్రికా మహిళల జట్టు మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతోంది. అందులో భాగంగా.. ఈరోజు మొదటి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఈ క్రమంలో.. ముందుగా టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన షఫాలీ వర్మ కేవలం (7) పరుగులు చేసి నిరాశపరచగా.. స్మృతి మంధాన సెంచరీతో అదరగొట్టింది. 127 బంతుల్లో 117 పరుగులు చేసింది. ఆ తర్వాత.. దీప్తి శర్మ (37), పూజా…
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచుతారు. 2022 మార్చిలో లిక్కర్ రేట్లు పెంచారు. మళ్లీ ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉంది. కానీ ఎన్నికల కారణంగా ధరల పెంపు వాయిదా పడింది. ఇప్పుడు అన్ని బ్రాండ్ల మద్యంపై 20 నుంచి 25 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా రూ.37 వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది. తెలంగాణలో…
వండిన ఆహారాన్ని వెంటనే తింటే ఆరోగ్యంగా ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO ) తెలిపింది. అయితే కొన్ని కారణాల వల్ల కొన్నిసార్లు వండిన ఆహారం తినడంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. అయితే.. ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోరు. అయితే.. వండిన తర్వాత చాలాసేపు అయిన తర్వాత ఆహారం తినడం ఆరోగ్యకరమైనది కాదని మీకు తెలుసా. దీని వల్ల అనారోగ్యానికి గురవుతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
చిన్నారిపై అత్యాచార ఘటన.. మంత్రులు సీరియస్ చిన్నారిని చిదిమేసిన నిందితున్నీ వదిలేది లేదని మంత్రులు సీతక్క,శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రులు సీతక్క,శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి కఠిన శిక్ష విధిస్తామన్నారు. రైస్ మిల్లులో పని చేస్తున్న వారి పై వివరాలు తెలుసుకునేందుకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ ఘటన పై ప్రభుత్వం చాలా సిరీయస్ గా ఉందన్నారు. ఇలాంటి సంఘటనల…
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇంకా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అంతేకాకుండా.. వేడిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికంగా ఉన్నాయి. వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. జూన్ 16 నుండి 18 వరకు ఉత్తరప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలలో హీట్ వేవ్ నుండి తీవ్రమైన హీట్ వేవ్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం (ఏఎఫ్‌సీఎస్) అమలు విషయంలో చేస్తోన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు మేరకు బోర్డు అనుమతితోనే ఈ వ్యవస్థను సంస్థ అమలు చేయడం జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించిందని చేస్తోన్న నిరాధారమైన ఆరోపణలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తోంది. నియమ నిబంధనలకు లోబడి బోర్డు అనుమతితోనే సంస్థలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేస్తోంది. అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు…
ఢిల్లీలో నీటి సమస్య తీవ్ర తరమవుతుంది. నీటి కోసం దాడులు చేసుకున్న సంఘటనలు వెలువడుతున్నాయి. ద్వారకా జిల్లాలో నీటి కోసం పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని వారికి సర్దిచెప్పారు. అయితే.. ఈ ఘర్షణలో ఎలాంటి మతపరమైన కోణం లేదని పోలీసులు స్పష్టం చేశారు. పబ్లిక్ కుళాయి నుంచి నీటిని తీసుకునే విషయంలో ఘర్షణ జరిగినట్లు ఢిల్లీ పోలీసులు…
తెలంగాణకు చెందిన 26 ఏళ్ల ద్విభాషా కవి , చిన్న కథా రచయిత నున్నవత్ కార్తీక్ తన చిన్న కథల సంకలనం ధవలో కోసం సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2024 గెలుచుకున్నాడు. అతి పిన్న వయస్కుడు కావడమే కాకుండా, ఈ అవార్డుతో స్మరించుకున్న మొదటి గిరిజన రచయిత కూడా. అతను రమేష్ కార్తీక్ నాయక్ అనే కలం పేరుతో వ్రాసాడు , అతని క్రెడిట్లో నాలుగు పుస్తకాలు ఉన్నాయి, తెలుగులో మూడు , ఆంగ్లంలో ఒకటి.…
మెట్రో రెడ్ లైన్ విస్తరణకు మార్గం సుగమమైంది. రిథాలా-నరేలా-కుండ్లీ మెట్రో కారిడార్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనను గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డీడీఏ (DDA) పంపింది. ఈ మేరకు శనివారం రాజ్‌నివాస్ వెల్లడించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ మెట్రో కారిడార్ నిర్మాణ అంశాన్ని కేంద్రంతో వివిధ సందర్భాల్లో ప్రస్తావించినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
గోషామహల్‌కు చెందిన బిజెపి శాసనసభ్యుడు టి రాజా సింగ్‌ను పోలీసులు ఆదివారం ఆర్జిఐ విమానాశ్రయంలో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రాజా సింగ్ ఆదివారం ఉదయం ముంబై నుండి నగరానికి వచ్చాడు , అతను మెదక్ జిల్లాకు వెళ్లనున్నాడని వార్తలు రావడంతో, పోలీసులు అతన్ని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉదయం నుంచి సైబరాబాద్ అల్లర్ల పోలీసులు, స్థానిక పోలీసులు ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో పెద్దఎత్తున మోహరించారు. పశువుల సమస్యపై…