YSRCP: ప్రకాశం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి, దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్దా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు రాజీనామా లేఖను పంపారు. ఇదిలా ఉండగా.. శిద్దా రాఘవరావు ఇప్పటివరకు తన భవిష్యత్ కార్యాచరణ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. శిద్దా రాఘవ రావు వ్యాపారవేత్తగానూ రాణించారు, 2014లో టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన శిద్దా రాఘవ రావుకు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చారు. అప్పట్లో ఆయన అటవీ శాఖతో పాటు పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా చేశారు. 2019లో ఒంగోలు టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.
Read Also: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా..?