మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి టీజీ భరత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కర్నూలులో పారిశుధ్యం, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, పచ్చదనంపై మంత్రి భరత్ అధికారులను ఆరా తీశారు. ఆక్రమణల తొలగింపులో తొందరపాటు వద్దని మంత్రి సూచించారు.
ఏపీలో నూతనంగా ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం విద్యాశాఖపై దృష్టి సారించింది. విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. విద్యావ్యవస్థలో మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. డ్రాప్ అవుట్స్, మౌలిక సదుపాయాలపై ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతిపై దృష్టి సారించిన ఏపీ సర్కారు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అవినీతే పరమావధిగా జలవనరుల శాఖను వైసీపీ పాలకులు దుర్వినియోగం చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
ఇటలీలో జీ7 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఇటలీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. ఇటలీ పర్యటనలో జీ7 దేశాల ఔట్ రీచ్ సదస్సుకు హాజరైన మోడీ.. వివిధ దేశాధినేతలతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
ఢిల్లీలో నీటి సమస్యలపై ఆందోళనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆప్ సర్కార్ పై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఎక్కడికక్కడ నిరసనలు చేపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మొన్నటి వరకు మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ.. నీటి సమస్యపై ఆప్ పార్టీపై యుద్ధం ప్రకటించింది. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు సర్కార్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. నీటి సమస్యలు పరిష్కరించాలంటూ ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మట్టి కుండలు పగలగొట్టి…
తమిళనాడులో ఆపరేషన్ చిరుత విజయవంతమైంది. 9 గంటల పాటు శ్రమించి ఫారెస్ట్ సిబ్బంది చిరుతను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తిరుపత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని సామ్ నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి చిరుతపులి ప్రవేశించింది. ఈ క్రమంలో.. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే.. ఆ చిరుత ఇంట్లో నుంచి సమీపంలోని ప్రైవేట్ పాఠశాల ఆవరణలోకి దూకింది. అక్కడ పాఠశాల వాచ్మెన్ రాజ గోపాల్ తలపై చిరుత దాడి చేసి ఆ…
ఘజియాబాద్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. చాలా దూరం వరకు భారీగా పొగలు అలుముకున్నాయి. స్థానిక అగ్నిమాపక శాఖ అనేక అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి తరలించి మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టింది.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్యకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కోర్టు ప్రొసీడింగ్స్ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది. మార్చి 28వ తేదీన రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో జడ్జి కావేరి భావేజ ముందు జరిగిన లిక్కర్ కేసు విచారణ సందర్భంగా.. సీఎం కేజ్రీవాల్ తన అరెస్ట్ కు సంబంధించిన వాదనలు కోర్టుకు వినిపించారు. ఈ క్రమంలో.. కేజ్రీవాల్ కోర్టు ముందు చెప్పిన వీడియో, ఆడియో…
ఉక్రెయిన్‌తో సంధికి సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. మాస్కో సేనలు ఆక్రమించిన నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ దళాలు వెళ్లిపోవాలి, నాటో కూటమిలో చేరాలన్న ప్రయత్నాలను ఆ దేశం విరమించుకోవాలని షరతులు పెట్టింది.
మైనర్ అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి మార్చి బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ అకౌంట్లు సృష్టించి వాటి ద్వారా మైనర్ అమ్మాయిలను పరిచయం చేసుకుంటున్న అజయ్ కుమార్‌ను ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఘట్కేసర్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు తెలిపారు.