మంత్రిగా నారా లోకేష్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకూ నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించలేదు. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు మంత్రి వర్గ సమావేశం కూడా ఉండటంతో ఆయన పదవీ బాధ్యలను సచివాలయంలో చేపట్టనున్నారు. ఇప్పటి వరకూ బాధ్యతలను చేపట్టక పోవడానికి ఆయన ఛాంబర్ లో స్వల్ప మార్పులు చేర్పులు చేయడం వల్లే అని చెబుతున్నారు. స్వల్ప మార్పులు చేయాల్సి రావడంతో… ఈ రోజు ఉదయం 9.45 గంటలకు నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించనున్నారు.…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కల్యాణ్ స్పీడ్ పెంచారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యల స్థితిగతులను తెలుసుకునేందుకు ఆయన ప్రతిరోజూ వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. జన దర్బార్ ద్వారా పవన్ కళ్యాణ్ తన సహాయాన్ని కోరేందుకు వచ్చిన ప్రజలను నేరుగా కలుసుకుని ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం విజయవాడలోని పవన్ క్యాంపు కార్యాలయంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు పవన్ కల్యాణ్‌ని కలవనున్నారు.…
BRS MLA Sanjay Kumar: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తం చెప్పింది. శ్రీవారిని దర్శించుకునేందుకు నేడు ఆన్లైన్లో టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఇవాళ విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు. ఉదయం 10 గంటలకు టీటీడీ ఈ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు ప్రత్యేక దర్శనం చేసుకోవాలనుకునే భక్తుల టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పింది. అలాగే.. తిరుమల, తిరుపతిలో సెప్టెంబర్ నెల వసతి గదుల కోటాను కూడా…
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. నేడు ఆన్లైన్లో సెప్టెంబర్ నెల టిక్కెట్లు విడుదల, మధ్యాహ్నం వసతి గదుల కోటాను విడుదల చేయనున్న టీటీడీ. నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలవనున్న టాలీవుడ్ నిర్మాతలు. తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పవన్‌కు వివరించనున్న నిర్మాతలు. సినిమా టికెట్ల రేట్ల విషయంలో పవన్ కల్యాణ్‌తో చర్చించనున్న నిర్మాతలు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీల…
బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ.. వేలంలో పాల్గొనాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తప్పుబట్టారు. సోమవారం వేలం వేయనున్న 90 బొగ్గు గనుల్లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు చెందిన శ్రావణపల్లి బొగ్గు బ్లాకు ఒకటి. ఈ వేలానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరవుతారని ఆదివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఈశ్వర్ తెలిపారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి ఏ రేవంత్…
బాపట్ల జిల్లా రామాపురం బీచ్‌లో వరుస ప్రమాదాలపై జిల్లా మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. వరుస ప్రమాదాలు జరుగుతూ ముక్కుపచ్చలారని యువకులు చనిపోతుంటే ఎందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టట్లేదని అధికారులను మంత్రి నిలదీశారు.
వికారాబాద్ జిల్లా తాండూరులో చోరీకి గురైన ఫోను ఆ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసింది. ఫోను చోరీ చేసిన వ్యక్తి రైలు కింద పడి చనిపోవడంతో బతికున్న వ్యక్తి చనిపోయినట్లుగా భావించారు. అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కడసారి చూపు చూ చూసేoదుకని బంధువులు మిత్రులు అందరూ వచ్చేశారు. అంత్యక్రియలకు తరలించేందుకు పాడి ఎక్కించే సమయంలో అసలు వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అది చూసి కుటుంబ సభ్యులు బంధువులు అంతా అవాక్కైపోయారు. వివరాలలోకి వెళితే…. బషీరాబాద్ మండలం…
నంద్యాలలో దారుణం జరిగింది. వేధింపులు తాళలేక కట్టుకున్న భర్తను భార్య కత్తితో పొడిచి హత్య చేసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నంద్యాలకు చెందిన వెంకటేశ్, మమత భార్యాభర్తలు. వెంకటేష్ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. భార్య భర్తల మధ్య కొన్ని నెలలుగా విభేదాలు నెలకొన్నాయి.