తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశమున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ఈరోజు రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉందిన వాతావరణ శాఖ పేర్కొంది. అయితే.. హైదరాబాద్‌లో శనివారం అర్థరాత్రి తేలికపాటి వర్షాలు కురుస్తుండగా, తెలంగాణ ఉత్తర,…
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఆరెంపల గ్రామంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీరు ఎంతయితే ఆనందంతో పాలాభిషేకం చేశారన్నారు. గత ప్రభుత్వములో లాగా పది సంవత్సరాలు రుణమాఫీ ఇచ్చేయకుండా మాయ మాటలు చెప్పి గడిపిన నట్లుగా మా ప్రభుత్వం ఉండదని, ముఖ్యమంత్రి క్యాబినెట్ సమక్షంలో ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో రైతుని రాజు చేయాలన్నదే మా ఆశయమని, నిబద్ధత గల ప్రభుత్వం…
ఎయిర్ కండీషనర్ అనేది ఒకసారి కొన్నది చాలా కాలం పాటు ఉపయోగించబడుతుంది. అందుకే మన అవసరాలకు తగినట్లుగా సరైన యూనిట్‌ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. దాని పనితీరును ఎక్కువ కాలం కొనసాగించడానికి దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. దీనితో పాటు ఎయిర్ కండీషనర్‌ను మార్చడానికి సమయం ఆసన్నమైందో లేదో తెలుసుకోవడం కూడా ముఖ్యం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బాయ్ కూనవరం. ప్రాంతానికి చెందిన సకిని రామచంద్రయ్య అనారోగ్యంతో కొద్దిసేపటి క్రితం మృతి చెందారు కోయ వర్గానికి చెందిన సకిని రామచంద్రయ్య మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మని తన మేళంతో ప్రచారాన్ని కొనసాగించేవాడు తన 15 గిరిజన భాషలో మేళతాళాలు వాయిస్తూ ఉండి వ్యక్తి రామచంద్రయ్య ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది ఆనాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోయంక సకిన రామచంద్రయ్యకు పద్మశ్రీ అవార్డుని అందించారు కాగా…
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సకుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్పీకర్‌కు ఆలయ ఈఓ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
రైతు బంధు ఆపడానికి వీలు లేదని బీఆర్ఎస్ ఎమ్మె్ల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు భరోసా పై కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. రైతు భరోసా ఇస్తున్నట్టు చెప్పారు… మరి కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేశారు..? అని ఆయన ప్రశ్నించారు. రైతు బంధు ను బీఆర్ఎస్ సర్కార్ హయంలో జూన్ చివరి నాటికి వేసేవాళ్ళమని, రుణమాఫీ తో సంబంధం లేకుండా రైతు భరోసా అమలు చేయాలని BRS డిమాండ్ చేస్తుందన్నారు. మహిళలకు…
శనివారం పూణె-నాసిక్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర ఎమ్మెల్యే మేనల్లుడు ప్రయాణిస్తున్న కారు రాత్రి ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 19 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మయూర్ మోహితను అరెస్ట్ చేశారు. పూణే జిల్లాలోని ఖేడ్ అలండి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే దిలీప్ మోహితే పాటిల్ మేనల్లుడు మయూర్. దిలీప్ మోహితే పాటిల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అజిత్ పవార్…
ఏపీలోని పలు జిల్లాల్లో డయేరియా కలకలం సృష్టిస్తోంది. కాకినాడ జిల్లాలో డయేరియా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు డయేరియా బాధితుల సంఖ్య 210కి చేరగా.. ఆస్పత్రుల నుంచి140 మంది డిశ్చార్జ్ అయ్యారు. డయేరియాతో కొమ్మనాపల్లికి చెందిన నాగమణి, వేట్లపాలెంకు చెందిన సత్యవతి అనే ఇద్దరు మహిళలు మృతి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Legal Notices: ఫ్లై యాష్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధార ఆరోపణలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, పలు న్యూస్ ఛానెల్స్, పత్రిక లకు లీగల్ నోటీసులను అడ్వకేట్ ఈటోరు పూర్ణచందర్ రావు జారీ చేశారు.
Miyapur: మియాపూర్ ప్రభుత్వ భూముల పై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు సంగీత, సీత అనే మహిళ చాలామంది మహిళలను రెచ్చగొట్టారని దర్యాప్తులో వెల్లడికావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.