ఐటీ, మానవ వనరులు, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా నారా లోకేష్ ఇవాళ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లోని 208వ నంబర్ గదిలోకి లోకేష్ ప్రవేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంతకం చేసిన ఐదు ఫైళ్లను పరిశీలించేందుకు మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ సంతకం చేసి, సోమవారం సమావేశం కానున్న మంత్రివర్గానికి పంపారు. అయితే.. లోకేష్ మంత్రి బాధ్యతలు స్వీకరించడంపై…
పాకిస్థాన్‌లో కలకలం రేపుతున్న కాంగో వైరస్.. పాకిస్థాన్‌లో కాంగో వైరస్ కేసులు పెరుగుతున్నాయి. క్వెట్టా నుంచి తాజాగా మరో కొత్త కాంగో వైరస్ కేసు నమోదైంది. 32 ఏళ్ల రోగి ఫాతిమా జిన్నా ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేరారు. ఇప్పుడు వైద్య సంరక్షణలో ఉన్నారు. పాక్ కి చెందిన ఓ న్యూస్ ఛానెల్ ఈ విషయాన్ని వెల్లడించింది. రోగి పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని కిలా సైఫుల్లా జిల్లా కిలా సైఫుల్లా నగరంలో నివాసి అని ఆసుపత్రి వర్గాలు…
IAS Officers Transferred: రాష్ట్రంలో 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందే.. పలువురు జిల్లా ఎస్పీలు, ఆ స్థాయి అధికారులు బదిలీ అయ్యారు.
నేటి నుండి రాజమండ్రి మీదుగా నడిచే 26 రైళ్లను 45 రోజులపాటు రద్దు చేశారు. రైల్వే అధికారులు రద్దు చేసిన వాటిలో రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి, సర్కార్ సహా ప్రయాణికులు డిమాండ్ ఉన్న రైళ్లు ఉన్నాయి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం – నిడదవోలు మధ్య రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులు చేపడుతున్న కారణంగా రైళ్లు రద్దు చేశారు. రద్దు చేసిన వాటిలో రత్నాచల్, జన్మభూమి , సింహాద్రి , సర్కార్ ఎక్స్‌ప్రెస్ సహా డిమాండ్ ఉన్న…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సోమవారం తన మొదటి సమావేశాన్ని ప్రారంభించింది, ఎన్నికల హామీలను నెరవేర్చడం, అమరావతి రాజధాని ప్రాజెక్టు పునఃప్రారంభం, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు, పెరిగిన సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ వంటి పెద్ద అంశాలు చర్చకు వచ్చాయి. అమరావతిలోని వెలగపూడిలోని సచివాలయం మొదటి బ్లాక్‌లో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఐదు ఫైళ్లపై సంతకం చేయగా, ఈ ఫైళ్లలో మెగా డీఎస్సీ, భూ పట్టాదారు చట్టం రద్దు, పెన్షన్ మొత్తాన్ని…
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సూపర్-6 పథకాల అమలుపై కేబినెట్ చర్చించనుంది. పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే.. చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాల ఫైళ్లను ఆమోదించనుంది కేబినెట్. అన్న క్యాంటీన్లకు ఇప్పటికే రూ. 164 కోట్ల కేటాయింపు. వచ్చే నెలలో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించే అంశంపై కేబినెట్లో చర్చ జరుగనుంది. హామీ మేరకు పెంచిన…
మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా నారా లోకేష్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించి, మెగా డీఎస్సీ నిబంధనల తొలి ముసాయిదాపై సంతకం చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లోని 208వ నంబర్ గదిలోకి లోకేష్ ప్రవేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంతకం చేసిన ఐదు ఫైళ్లను పరిశీలించేందుకు మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ సంతకం చేసి, సోమవారం సమావేశం కానున్న…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటన ఖరారైన విషయం తెలిసిందే. ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. రెండు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటించనుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చంద్రబాబు పర్యటనకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు తన పర్యటనలో భాగంగా, నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలను కలవనున్నారు. నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటించి…
మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు మూడో రోజు పులివెందుల పర్యటించనున్నారు. ఈ పర్యటనలో గత రెండు రోజుల పాటు ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. నేటితో ఆయన తన పర్యటన ముగించుకోనున్నట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం వరకు పులివెందుల క్యాంపు అఫీసులోనే వైఎస్ జగన్ ఉండనున్నారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను ఆయన కలుస్తారు. ఈ సందర్భంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన పార్టీ శ్రేణులు తరలివచ్చే అవకాశం కనిపిస్తోంది.…
నేటి నుంచి లోక్ సభ సమావేశాలు.. నీట్ పరీక్షపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం రెడీ 18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం (జూన్ 24) నుంచి ప్రారంభం కానున్నాయి. లోక్‌సభ మొదటి సెషన్లో మొదటి రోజు ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన ఎంపీలు సోమవారం ఉదయం పార్లమెంటు కాంప్లెక్స్‌లో సమావేశమై సభ వైపు కలిసి కవాతు చేస్తారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు లోక్‌సభ ప్రొటెం…