Niranjan Reddy: రైతుబంధు ఎప్పుడు ఇస్తారని మమ్మల్ని జనం అడుగుతున్నారు..
- కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు
- ఎన్నికల ముందు కూతలు.. అధికారంలోకి వచ్చాక కోతలు- నిరంజన్ రెడ్డి
- రైతుబంధు ఎప్పుడు ఇస్తారని జనం మమ్మల్ని అడుగుతున్నారు- నిరంజన్ రెడ్డి
- ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పింది- నిరంజన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కూతలు… ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలు అని విమర్శించారు. మరోవైపు.. రైతుబంధు ఎప్పుడు ఇస్తారని జనం తమను అడుగుతున్నారని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ అంతా చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని.. 2018 కంటే ముందు మిగిలిన వ్యవసాయ రుణమాఫీ ఏం చేస్తరని కాంగ్రెస్ ప్రభుత్వంను అడుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఇస్తారా ? ఇవ్వరా ? చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా మాఫీ చేస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదని తెలిపారు. రైతుల రుణాల వివరాలు చెప్పాలి.. ఎందుకు దాచి పెడుతున్నారు? అని ఆయన ప్రశ్నించారు.
Asaduddin Owaisi: ఓవైసీ ప్రమాణస్వీకారం.. లోక్‌సభలో దుమారం..
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
రాష్ట్రంలోని అన్నదాతలకు ఈ వర్షాకాలం నుంచే రైతు భరోపా పథకం అమలు చేయాలని కోరారు. రైతులకు వెంటనే ఎకరానికి రూ. 7500 సాయం అందించాలన్నారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తారా..? లేదా..? రైతు కూలీలకు 12 వేలు ఇస్తారా ? కౌలు రైతులకు 15 వేలు ఇస్తరా.. లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలన్నారు. మహాలక్ష్మి పథకం ఏమైంది ?.. రేషన్ కార్డులు లేనివారికి కొత్తవి ఇస్తామని చెప్పారు. ఇప్పుడేమో అన్ని కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటున్నారని నిరంజన్ రెడ్డి పేర్కన్నారు. ఏం చేయకుండానే రేవంత్ ప్రభుత్వం ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తుందని ఆరోపించారు. రుణమాఫీ చేసినట్టే సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
Thaman – Sree Leela: తిరుమల గుడిలో శ్రీ లీల బుగ్గ గిల్లిన తమన్
మరోవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంపై స్పందిస్తూ, ఆ ఇంటి కాకి.. ఈ ఇంటి మీద వాలితే కల్చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నారని.. మరి ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి రేవంత్ ఎందుకు కండువా కప్పుతున్నారు.. కౌగిలించుకుంటున్నారని ప్రశ్నించారు. కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకుంటే.. తెలంగాణ సోయి ఎక్కడ పోదని పేర్కొన్నారు. తమ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు పోతే నష్టం ఏమి లేదని తెలిపారు. నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నా.. పోయినా బీఆర్ఎస్ తన పాత్ర పోషిస్తుందని నిరంజన్ రెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!