వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిందో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలియకపోయినా ఏపీ ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. ఇద్దరూ ఓడిపోయి మిత్ర ధర్మాన్ని పాటించారని మీడియా సమావేశంలో సెటైర్లు వేశారు. ‘తెలంగాణలో BRS(కేటీఆర్) ఓడితే జగన్ పట్టించుకోలేదు. మీరు మాత్రం ఆయనను ఓదారుస్తున్నారు. YCP పరాజయం కంటే ముందు తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఆలోచించుకోవాలి’ అని హితవు పలికారు రఘురామకృష్ణం రాజు. ఇదిలా ఉంటే.. ఏపీలో వైసీపీ, కేతిరెడ్డి…
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో రియల్టర్ దారుణహత్యకు గురయ్యాడు. కేకే ఫామ్‌హౌస్‌లో కమ్మరి కృష్ణను కొందరు దుండగులు దారుణంగా హత్యకు చేశారు.
గ్రూప్ 2 పోస్టులను పెంచి డిసెంబర్ నెలలో పరీక్షలను నిర్వహించాలని గ్రూప్-2 అభ్యర్థులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రూప్-2 అభ్యర్థులు మాట్లాడారు.
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు బుధవారం రాత్రి ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీదత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్‌లో మంటలు భారీగా చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటల ధాటికి కాంప్లెక్స్ అద్దాలు పగిలిపోయాయి.
జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు పునరాగమనం చేసింది. రెండో మ్యాచ్‌లో టీమిండియా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పుడు మూడో మ్యాచ్‌లో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తెలంగాణలో 15 మంది సీనియర్ ఐపీఎస్‌ల బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.
సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ సెంటర్ల పనితీరు, అందుతున్న సేవలపై జిల్లా అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. ఈ సమీక్షలో మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో సత్యా ఏజెన్సీస్ 24వ షోరూంను ఘనంగా ప్రారంభించారు. భవన యజమాని గోవిందరావు రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఆయనతో పాటు సత్యా ఏజెన్సీస్ ఏపీ హెడ్ సెంథిల్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.