CM Revanth Reddy: ఒక బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలి.. సీఎం రేవంత్ ఆదేశాలు జారీ
- హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఈ సమావేశానికి సీఎస్ శాంతికుమారి.. ఇతరు అధికారులు హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: సచివాలయంలో హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్)పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. హైడ్రా విధివిధానాలపై చర్చిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కీలకమైన సేవలను అందించేందుకు హైడ్రా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిటీ విస్తరణకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకొని ప్రజలకు విస్తృత సేవలు అందించేలా కొత్త వ్యవస్థను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, పోలీస్ విభాగాలన్నింటి మధ్య సమన్వయం ఉండేలా హైడ్రాను రూపకల్పన చేయాలనేది సీఎం ఆలోచన. వర్షాకాలంలో విపత్తులు సంభవించే అవకాశం ఉన్నందున ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: Raghunandan Rao: పంచాయతీల కాల పరిమితి ముగిసింది.. వెంటనే ఎన్నికలు జరపాలి..
Also Read
హైడ్రా విధివిధానాలపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2వేల చదరపు కి.మీ పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా ఉండాలని సీఎం అధికారులకు వెల్లడించారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగింపు, అపరాధ రుసుము వసూలు బాధ్యత హైడ్రాకు బదలాయించాలన్నారు. జోన్ల విభజనలో పోలీస్ స్టేషన్ పరిధులు, అసెంబ్లీ నియోజకవర్గ పరిధులు పూర్తిగా ఒకే జోన్ లో వచ్చేలా జాగ్రత్త వహించాలన్నారు. నాళాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినతరం చేసేలా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండేలా చూడాలన్నారు. ఒక బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోగా పూర్తిస్థాయి విధివిధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులకు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!