రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ కమిటీ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావు, శివశంకర్ (రిటైర్డ్ ఐఏఎస్), జీఏడి అధికారులు పాల్గొన్నారు . ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది.
ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలను జులై 24 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గురువారం మధ్యాహ్నం వివిధ శాఖల అధికారులతో అసెంబ్లీ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
క్షేత్రస్థాయిలో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి పూర్తిస్థాయి మార్గదర్శకాలతో ‘రైతుభరోసా’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో రైతు భరోసా విధివిధానాల ఖరారుపై ఉమ్మడి అదిలాబాద్ జిల్లా రైతుల నుండి అభిప్రాయాలు, సలహాలను కేబినెట్ సబ్ కమిటీ సేకరించింది.
ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులు, తోటి స్టాఫ్‌తో కలిసి ప్రేయర్ చేస్తున్న టీచర్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అనంతరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
అమెరికా టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం మైక్రోలింక్ నెట్ వర్క్స్ రూ.500 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో తమ ఎలక్ట్రానిక్, ఇతర ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన పీఎస్ఆర్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో మైక్రోలింక్ పరిశ్రమల క్లస్టర్‌ను ప్రారంభిస్తుందని తెలిపారు.
బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ బైక్ ఫ్రీడమ్ 125 ను జూలై 5న విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత.. ఇప్పుడు టీవీఎస్ (TVS) మోటార్ కంపెనీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదటి గ్రౌండ్-అప్ సీఎన్జీ స్కూటర్‌ను తయారు చేయాలని యోచిస్తోంది. టీవీఎస్ మోటార్ కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా వివిధ ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతలపై పని చేస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా ఈ-కేవైసీ సమస్యతో రిజిస్ట్రేషన్లు స్తంభించాయి. సాంకేతిక లోపంతో ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేయలేదు. రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర ప్రజలు పడిగాపులు కాస్తున్నారు.
మనం తినే ఆహారంలో అనేక మసాలా దినుసులను ఉపయోగిస్తాము. ఇవి ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. పసుపు కూడా ఈ సుగంధ ద్రవ్యాలలో ఒకటి. దీనిని ఆహారం రంగు, రుచిని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా పసుపును పొడి రూపంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఈసారి కేంద్ర బడ్జెట్లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకురావాలని.. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. పదేళ్లుగా ప్రతి బడ్జెట్లో కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపిందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
విశాఖపట్నం దార్లపూడి పోలవరం కెనాల్ దగ్గర ప్రజలతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. నార్త్ కొరియా లో నవ్వినా, ఏడ్చినా కొట్టే కిమ్ లాంటి జిమ్ మన రాష్ట్రంలో ఉన్నాడన్నారు. మనకు ఆర్థిక వెసులు బాటు కల్పించాల్సిన బాధ్యత ఎన్డీఏపై ఉందన్నారు. విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణ ను నేను ఒప్పుకున్నామని చెబుతున్నారన్నారు. గతంలో వాజపేయి హయాంలో ప్రైవేటీకరణ చేస్తాన్నప్పుడు అడ్డుకున్నాం, ఈ సారీ కాపడుతామని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ ను దోచేసిన దొంగలను వదిలే ప్రసక్తే లేదన సీఎం…