జాతీయ రహదారులకు భూ సేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత రైతులకు దక్కేలా చూడాలన్నారు. తెలంగాణలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పరిధిలో రహదారుల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.
విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఆ స్కూల్లో మాత్రం తరగతులు ప్రారంభం కాలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలోని మంగపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాల ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌పై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కవిత పాత్రను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించింది. 100 కోట్ల రూపాయల నగదు లిక్కర్ స్కాం ద్వారా చేతులు మారినట్లు ఈడీ పేర్కొంది. ఆప్ ఇచ్చిన నగదు మొత్తాన్ని గోవా ఎన్నికల కోసం ఖర్చుపెట్టినట్లు వెల్లడించింది. కవిత మాజీ పీఏ అశోక్ కౌశిక్ చేతుల మీదుగా లావాదేవీలు జరిగినట్లు తెలిపింది.
తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీ రవిగుప్తాను హోమ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసింది. పంజాబ్‌కు చెందిన జితేందర్ 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి జితేందర్.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి డీజీపీ అయ్యారు.
మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్లెట్.. మన 'ముకుంద జ్యువెల్లర్స్'. ఈ నెల 11న(రేపే) హైదరాబాబాద్‌లోని సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్‌లలో బ్రాంచ్‌లను కలిగి ఉన్న 'ముకుంద జ్యువెల్లర్స్'.. సోమాజిగూడలోని సీఎం క్యాంపస్ ఎదురుగా తన నూతన బ్రాంచ్‌ను ప్రారంభిస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. జడ్జీలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు ఫోన్ నెంబర్లు, ఫోటోలు బహిర్గతం కావడంపై హైకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇక మీద ఇలా జరిగితే కోర్టు ఉల్లంఘనల కిందకు వస్తుందని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
తెలంగాణ ఆర్టీసీలో భర్తీ చేసే ఉద్యోగాలపై ఎండీ వీసీ సజ్జనార్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్ల పేరిట ఆన్లైన్లో వస్తున్న లింకులను నమ్మవద్దని ఆయన కోరారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎండీ వీసీ సజ్జనార్ కీలక అలర్ట్ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇటీవల ప్రకటించిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో మెట్పల్లి పట్టణానికి చెందిన జనమంచి సాయిశిల్ప రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించింది. ఇంగ్లీష్ సబ్జెక్టులో 450 మార్కులకు గాను 325.657 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. గతంలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన సాయిశిల్ప తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (గురుకులం పాఠశాలలు) నిర్వహించిన డిగ్రీ లెక్చరర్ రిక్రూట్మెంట్ టెస్ట్‌లో స్టేట్ సెకండ్ ర్యాంక్ కూడా సాధించింది.…
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి వాహనదారులను సరైన క్రమంలో ప్రభుత్వ గుర్తింపు ప్రకారం ఉన్న నంబర్ ప్లేట్లను అమర్చాలనే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణాలను ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ ను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు 50 నంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించడం జరిగిందని, వారం రోజులుగా ఇప్పటివరకు 321 వాహనాలను గుర్తించి వారి వాహనాలను తాత్కాలికంగా సీజ్…