Shabbir Ali: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ హయాంలో 46 మందిని పార్టీలో చేర్చుకున్నారని చెప్పారు. తాను చెప్పిన వివరాలు తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని షబ్బీర్ అలీ అన్నారు. మరి కేటీఆర్ ఏం చేస్తారో చెప్పాలని ఛాలెంజ్ చేశారు. తలసాని టీడీపీకి రాజీనామా చేయకుండానే మంత్రిని చేసింది కేటీఆరేనని పేర్కొన్నారు. మండలిలో తాను ప్రతిపక్ష నేతగా ఉన్నా… దాన్ని లేకుండా చేసింది కేటీఆరేనని అన్నారు. తేదీల వారీగా కేటీఆర్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న లిస్ట్ చెప్పడానికి కూడా రెడీ అంటూ షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కోనేరు కోనప్ప, ఇంద్రకరణ్ రెడ్డి, విఠల్ రెడ్డి… ఇలా వరుస బెట్టి చేర్చుకున్నది కేటీరేనని చెప్పుకొచ్చారు. తాను చెప్పిన వివరాలు తప్పు అని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఆయన ఛాలెంజ్ చేశారు. నువ్వేం చేస్తావో చెప్పు.. లేదంటే మాట్లాడకుండా ఊరుకో అంటూ షబ్బీర్ అలీ సవాల్ విసిరారు.