బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై ఏపీ మంత్రి సత్య కుమార్ విమర్శలు గుప్పించారు. “ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూ మాఫియా మాదిరే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూ బకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజల ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు, కొండలను కూడా అతడు కబళించాడు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా… కలెక్షన్… కరప్షన్… కమీషన్లే! ఫాంహౌస్ కు పరిమితమైన మీరు ఎక్స్ లో అడిగినా అతడి…
ఖమ్మం కలెక్టరేట్లో రైతు భరోసా పథకంపై మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ర్ట వనరులు, సంపద ప్రజలకే పంచుతామన్నారు. రైతు బంధు పేరుతో ఒకే సారి నిధులు విడుదల చేశామని, రైతు భరోసా అమలుకు బడ్జెట్ సమావేశం లో నిధులు కేటాయించనున్నామన్నారు భట్టి విక్రమార్క. శాసనసభ లో చర్చ కు పెడతామని,…
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం స్వాగతిస్తున్నానని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన నల్లగొండ జిల్లాలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజన హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని ఆయన కోరారు. శాస్త్రీయమైన పద్ధతుల్లో కృష్ణా నది జలాల పంపిణీ జరగాలని, కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయమే జరిగిందన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. 7 మండలాలు తిరిగి తెలంగాణకు రాకపోవచ్చని, 5 గ్రామాలు…
అస్సాంలో నీట మునిగిన 27 జిల్లాలు.. వరదలకు విలవిలలాడుతున్న 19లక్షల మంది ప్రస్తుతం దేశం మొత్తం రుతుపవనాలు చాలా చురుగ్గా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల మినహా దేశవ్యాప్తంగా ఈ రోజుల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబయిలో కురుస్తున్న వర్షాలకు తోడు అస్సాంలో వరదలు ప్రజల ఆందోళనను మరింత పెంచుతున్నాయి. అస్సాంలో ఇప్పటికీ లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. ప్రభుత్వ లెక్కల…
సీఎం రేవంత్ రెడ్డి నేడు జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. జాతీయ రహదారుల పనులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు చేపట్టే విషయంపై ఈ సమీక్షలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో.. NHAI అధికారులు, కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే.. జాతీయ రహదారుల నిర్మా ణానికి తమ పూర్తి సహకారం ఉంటుం మని స్పష్టం చేశారు. ఎన్ హెచ్ ఏఐ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఆయన నివాసంలో…
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు రానున్న రెండు రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది. జులై 12 వరకు బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని, దీంతో ఎల్లో అలర్ట్‌ను జారీ చేయాలని డిపార్ట్మెంట్ని కోరింది. ఈ నైరుతి రుతుపవనాల సమయంలో తెలంగాణలో గణనీయమైన వర్షపాతం నమోదైంది, రాష్ట్రంలో…
నేడు సజ్జల, ఆర్కే, దేవినేని అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ. టీడీపీ ఆఫీసుపై దాడికేసులో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్. ఇప్పటికే దాఖలైన అన్న పిటిషన్లు కలిపి నేడు విచారిస్తామన్న ఏపీ హైకోర్టు. నేటి నుంచి బాపట్లలోని సూర్యలంక బీచ్‌లో పర్యాటకులకు అనుమతి. గత నెలలో ప్రమాదాలతో బీచ్‌లో పర్యాటకులకు అనుమతి నిరాకరించిన అధికారులు. నేడు ఢిల్లీలోని తెలంగాణ భవన్ బోనాల సందడి. నేడు బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పణ. అంబేద్కర్ ఆడిటోరియంలో సాంస్కృతిక…
చివరి టీ20లో భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈరోజు (మంగళవారం) దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్ లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం చేసింది. మొదటి మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలుపొందగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. చివరి మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది.
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం తోపులాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. కుట్ర కోణంపై పోలీసులు విచారణ జరుపుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై సెక్రటేరియట్లో దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి కొండా సురేఖ అత్యవసర సమావేశం నిర్వహించారు. బల్కంపేట ఎల్లమ్మ బోనాల సందర్భంగా జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘనలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో.. రేపట్నుంచి తెలంగాణలో రైతు భరోసా సదస్సులు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాల వారిగా రేపటి నుంచి 22 వరకు వర్క్ షాప్ జరుగనుంది. ఈ సదస్సుల్లో అన్ని మండలాల నుంచి వ్యవసాయ శాఖ అభిప్రాయాలు తీసుకోనుంది. రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, ఇతరుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.