అప్పన్న సన్నిధిలో అపశృతి.. గోడకూలి ఏడుగురు మృతి సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. క్యూలైన్ లో ఉన్న భక్తులపై గోడ కూలి ఏడుగురు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారందరినీ పోలీసులు ఆస్పత్రికి తరలిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో భక్తులు నిజరూప దర్శనం కోసం భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆ సమయంలో భారీ వాన కురిసింది. ఆ ధాటికి గోడ కూలి భక్తులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే…
తెలంగాణలో నేడు పదో తరగతి ఫలితాలు విడుదల. మధ్యాహ్నం ఒంటిగంటకు ఫలితాలు విడుదల. ఫలితాలను విడుదల చేయనున్న సీఎం రేవంత్. టెన్త్ పరీక్షలు రాసిన 5 లక్షల మంది స్టూడెంట్స్. ఈ సారి గ్రేడింగ్‌తో పాటు మార్కులు విడుదల. టెన్త్ మెమోలలో సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్. నేడు మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీట్. మధ్యాహ్నం 1.30కి సచివాలయంలో మంత్రులతో సీఎం లంచ్. అమరావతి రాజధాని రీలాంచ్ కార్యక్రమం, ప్రధాని మోడీ సభ విజయవంతం చేయడంపై చర్చ.…
దంచి కొట్టిన కోహ్లీ-క్రునాల్.. ఢిల్లీపై బెంగళూరు ఘన విజయం సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఢిల్లీకి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకున్నారు. భువనేశ్వర్ కుమార్ (3/33), జోష్ హాజిల్‌వుడ్ (2/36) గట్టి బౌలింగ్‌ను ఎదుర్కొని ఢిల్లీ బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించడంలో ఇబ్బంది పడ్డారు. ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ 41…
విజయవాడ: నేడు పీఎస్ఆర్ను సీఐడీ కస్టడీకి తీసుకునే ఛాన్స్. నిన్నటి నుంచే సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చినా.. నేడు మరోసారి వైద్యపరీక్షలు చేసి సీబీఐ కస్టడీకి తీసుకునే అవకాశం. చిత్తూరు: నేడు తుని మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నిక. టీడీపీకి 17, వైసీపీకి 11 మంది మద్దతు. టీడీపీకి రెండు పదవులు ఏకగ్రీవం అయ్యే అవకాశం. ఎన్నికల్లో వైసీపీ పాల్గొనడంపై సందిగ్ధత. చిత్తూరు: నేడు కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. వైసీపీకి చెందిన సుధీర్…
ఆర్సీబీలా మేం కూడా ప్లేఆఫ్స్‌కు చేరతాం.. నితీశ్ రెడ్డి కామెంట్స్ వైరల్! ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. వరుస పరాజయాలు చవిచూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. మరోవైపు అద్భుత ప్రదర్శన చేస్తోన్న గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ 12 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరువయ్యాయి. లేటుగా పుంజుకున్న ముంబై ఇండియన్స్ 10 పాయింట్లతో రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం ఈ…
ఐపీఎల్ 2025లో మొదటిసారి.. నాలుగో స్థానానికి పీబీకేఎస్! ఐపీఎల్ 2025లో మొదటిసారి ఓ మ్యాచ్ వర్షార్పణమైంది. శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా తుడిచి పెట్టుకుపోయింది. ఛేదనలో కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఒక ఓవర్ ముగిశాక వర్షం మొదలైంది. భారీ గాలులకు మైదానంను కవర్లతో కవర్ చేయడం కూడా కష్టమైంది. వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో ఆట సాధ్యం కాలేదు. వరుణుడి ప్రతాపంతో…
నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ. వరంగల్ శివారులోని ఎల్కతుర్తిలో భారీ ఏర్పాట్లు. ఎడ్లబండ్లపై సభకు బీఆర్ఎస్ శ్రేణులు. సభకు హాజరుకానున్న మాజీ సీఎం కేసీఆర్, BRS నేతలు. ఐపీఎల్లో నేడు రెండు మ్యాచ్‌లు. ముంబైతో తలపడనున్న లక్నో. ముంబై వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకి మ్యాచ్. ఢిల్లీ తో తలపడనున్న బెంగళూరు. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్. నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణభవన్‌లో పార్టీ జెండా ఎగరవేయనున్న కేటీఆర్.అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించనున్న కేటీఆర్.…
Crime: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి సంబంధించిన వీడియోలు తీసి, ఇద్దర్ని బ్లాక్మెయిల్ చేశారు. దీనిపై బాధితుల్లో ఒక మహిళ నిందితుడు ఫర్హాన్ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేయడంతో, అతడిని అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫర్హాన్‌తో పాటు అతడి స్నేహితుడు తనపై, తన సోదరిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది.
పాక్ అధికారి కవ్వింపు.. పీక కోస్తామంటూ ప్రవాస భారతీయులకు బెదిరింపు.. వీడియో వైరల్ యూకేలో పాకిస్థాన్ హైకమిషన్‌కు చెందిన కల్నల్ తైమూర్ రహత్ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. పహల్గామ్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశాడు. పీక కోస్తానంటూ బహిరంగా సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ భారతీయులు లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల నిరసన ప్రదర్శన చేపట్టారు. కల్నల్…