భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం
భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. గురువారం పంజాబ్ ప్రావిన్స్‌లోని కమ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంతో శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని.. ఇందులో కాశ్మీర్ అంశంపై కూడా ఉందని పేర్కొన్నారు. శాంతి చర్చలకు రావాలని ఆహ్వానించారు. జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్‌లో అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్ పదేపదే స్పష్టం చేస్తున్నా షరీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
గాజాలో ఇజ్రాయెల్ బాంబుల మోత.. 80 మంది పౌరులు మృతి..!
ఇజ్రాయెల్ తన దాడులను తీవ్రతరం చేయడంతో గాజా ప్రాంతంలో గురువారం ఒక్క రోజులోనే 80 మంది పౌరులు మృతి చెందారు. వీరిలో చాలా మంది మహిళలు, పిల్లలు ఉన్నారని పాలస్తీనా వైద్య వర్గాలు వెల్లడించాయి. ఖాన్ యూనిస్‌లోని నాసర్ ఆసుపత్రి ప్రకారం, ఆ నగరంపై జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 54 మంది మరణించారు. దాడుల్లో తీవ్రంగా గాయపడిన వారు అనేకమంది ఉన్నారు. అలాగే గాజా నగరం, ఉత్తర గాజా ప్రాంతాల్లో జరిగిన ఇతర వైమానిక దాడుల్లో మరో 26 మంది ప్రాణాలు కోల్పోయారని గాజా వైద్య వర్గాలు తెలిపాయి.
ప్లేఆఫ్స్‌కు బట్లర్ దూరం.. మయాంక్‌కు మళ్లీ గాయం!
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్‌కు గుజరాత్ టైటాన్స్ ఆటగాడు జోస్ బట్లర్ దూరం కానున్నాడు. జాతీయ జట్టు (ఇంగ్లండ్) తరఫున మ్యాచ్‌లు ఆడేందుకు మే 26న అతడు స్వదేశానికి వెళ్లనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ చివరి లీగ్ మ్యాచ్ అనంతరం బట్లర్ ఇంగ్లండ్ పయనం కానున్నాడు. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో గుజరాత్ ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. కీలక ప్లేఆఫ్స్‌కు బట్లర్ దూరం కావడం జీటీకి గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఇక బట్లర్ స్థానంలో శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్‌ను గుజరాత్ రూ.75 లక్షలకు తీసుకుంది.
కేవలం రూ.6,499కే 5000mAh బ్యాటరీ, IP54 రేటింగ్ లతో itel A90 భారత్‌లో లాంచ్!
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ itel తన బడ్జెట్ A సిరీస్‌ను మరింత విస్తరించింది. తాజాగా itel A90 పేరుతో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన itel A80 కు అప్డేటెడ్ గా వచ్చింది. ధరను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌లో ఉపయోగకరమైన స్పెసిఫికేషన్లు అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫోన్ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నీరవ్ మోడీకి మళ్లీ చుక్కెదురు.. బెయిల్ తిరస్కరించిన లండన్ కోర్టు
ఆర్థిక నేరస్థుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ బెయిల్ పిటిషన్‌ను లండన్ కోర్టు మళ్లీ తిరస్కరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో భారత మోస్ట్ వాంటెడ్ నిందితుల్లో ఒకరైన నీరవ్ మోడీ 2019 మార్చి నుంచి యూకే జైల్లో ఉన్నాడు. అతని బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురి కావడం ఇది పదోసారి కావడం విశేషం. తాజా బెయిల్ పిటిషన్‌ను లండన్‌లోని కింగ్స్ బెంచ్ డివిజన్ హైకోర్టు తిరస్కరించిందని సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలిపింది. లండన్‌కు వెళ్లిన సీబీఐ బృందం.. క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ సహాయంతో బెయిల్ వాదనలను తీవ్రంగా వ్యతిరేకించిందని కేంద్ర దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తాను ఏ తప్పు చేయలేదని.. భారత ప్రభుత్వం నుంచి ప్రాణాలకు ముప్పు ఉందని.. అందుకే పారిపోయినట్లు నీరవ్ మోడీ పిటిషన్‌లో పేర్కొన్నాడు.
తెలంగాణలో రెండోరోజు సరస్వతి పుష్కరాలు.. తొలిరోజు లక్ష మందికి పైగా భక్తుల పుష్కర స్నానాలు
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు రెండో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరంలో భక్తుల సందడి నెలకొంది. ఇక్కడ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మొదటి రోజు లక్ష మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కాళేశ్వరంలో కుంభమేళాను తలపించేలా టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. భక్తులు నదిలో స్నానాలు ఆచరించడానికి ప్రత్యేక ఘాట్‌లను సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఆర్సీబీకి గుడ్ న్యూస్.. ఆరుగురు మ్యాచ్ విన్నర్స్ తిరిగొచ్చేశారు!
ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కాబోతున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీకి గుడ్ న్యూస్. ఏకంగా ఆరుగురు విదేశీ మ్యాచ్ విన్నర్స్ ఐపీఎల్ 2025లో ఆడనున్నారు. రొమారియో షెపర్డ్, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్‌స్టోన్, జోష్ హేజిల్‌వుడ్, లుంగి ఎంగిడిలు మిగతా ఐపీఎల్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నారు. ఇక జేకబ్ బెథెల్ మాత్రమే ఐపీఎల్ లీగ్ దశ అనంతరం ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నాడు. విషయం తెలిసిన ఆర్సీబీ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఐపీఎల్ 2025 వాయిదా పడకముందే గాయపడ్డాడు. ఐపీఎల్ వాయిదా అనంతరం ఆస్ట్రేలియా వెళ్లిన హేజిల్‌వుడ్.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నేపథ్యంలో భారత్ రాడని అందరూ భావించారు.
చరిత్రలో తొలిసారి.. భారత విదేశాంగ మంత్రితో తాలిబాన్ మంత్రి సంభాషణ..!
ప్రాంతీయ రాజకీయాల్లో సరికొత్త మలుపు తిసుకున్న ఘటన తాజాగా చోటు చేసుకుంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ తొలిసారిగా ఆఫ్గానిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వ కార్యకలాప విదేశాంగ మంత్రి మౌలవి అమీర్ ఖాన్ ముత్తాకీతో ఫోన్ ద్వారా అధికారికంగా మాట్లాడారు. ఇది భారత్ తరఫున తాలిబాన్ ప్రభుత్వంతో మంత్రివర్గ స్థాయిలో జరిగిన తొలిసారిగా జరిగిన సమావేశంగా చరిత్రలో స్థానం సంపాదించింది.
హైవే పై రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన లారీ
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం ఓసి 2 సమీపంలో నేషనల్ హైవే పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది..ఈ ప్రమాదంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందు క్యాబిన్ భాగం పూర్తిగా ధ్వంసం అయింది..బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయి క్యాబిన్ లో ఇరుక్కుపోయ్యారు..మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావటంతో స్థానికులు సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు.
దయచేసి లొంగిపో.. ఉగ్రవాదితో తల్లి పలికిన మాటలు వైరల్
జమ్మూకాశ్మీర్, పుల్వామా జిల్లా, గురువారం తెల్లవారుజాము. నాదర్, ట్రాల్ ప్రాంతం. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల సమాచారం ఆధారంగా భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించాయి. డ్రోన్ ద్వారా ముగ్గురు ఉగ్రవాదుల కదలికలను ఓ ఇంట్లో గమనించారు. అదే సమయంలో మాతృమూర్తి మనసు తల్లడిల్లింది. ఉగ్రవాది అమీర్ నజీర్‌కు వీడియో కాల్ చేసింది. దయచేసి లొంగిపో అంటూ ప్రాధేయపడింది. బతిమాలింది. కానీ ముష్కరుడి మనసు మాత్రం కరగలేదు. తీవ్రవాదం ముందు కన్నప్రేమ ఓడిపోయింది. అంతే క్షణాల్లోనే భద్రతా దళాల కాల్పుల్లో అమీర్ నజీర్ హతమయ్యాడు. అయితే అందుకు సంబంధించిన వీడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.