ఈ సాలా కప్ నమ్దే.. ఇదే జరిగితే ఆర్‌సీబీ ప్లేఆఫ్ రేసు నుంచి అవుట్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. పలు జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించేందుకు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 17న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఈ మ్యాచ్ రద్దు వల్ల రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించగా, KKR ప్లేఆఫ్ అవకాశాలు ముగిసిపోయాయి.
పెళ్లైన ఆరు రోజులకే ఘోరం.. అందుకు ఒప్పుకోలేదని..
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలోని అమౌలి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. 44 ఏళ్ల వ్యక్తి రాజు పాల్ వివాహం అయిన ఆరు రోజుల తర్వాత తన భార్యను కొట్టి చంపాడు. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై భారత శిక్షాస్మృతి (IPC)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశారు.
కాల్పుల విరమణపై భారత ఆర్మీ సంచలన ప్రకటన.. అవన్నీ నమ్మొద్దంటూ..
భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన వార్తలపై భారత సైన్యం సంచలన ప్రకటన చేసింది. ఈరోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) స్థాయి చర్చలు జరగవని భారత సైన్యం స్పష్టం చేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఈరోజు ముగియబోతోందని కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయని ఆర్మీ తెలిపింది. దీంతో దేశ వ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఊహాగానాలపై భారత సైన్యం స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది.
పాతబస్తీ మీర్ చౌక్ అగ్రిప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
హైదరాబాద్‌లోని పాతబస్తీ మీర్ చౌక్ ప్రాంతంలో జరిగిన విషాదకరమైన అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, వారికి అన్ని విధాలా సహాయం చేయాలని సూచించారు.
ఐదేళ్ల మేనకోడలిపై మైనర్ మామ అత్యాచారం.. చివరకు.?
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ పట్టణంలో మానవ సంబంధాలను కలంకితం చేసే ఘటన చోటుచేసుకుంది. సిటీ కోత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో, ఓ మైనర్ బాలుడు తన మేనకోడలు అయిన ఐదేళ్ల చిన్నారి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నిందిత బాలుడు, బాధిత చిన్నారి ఇల్లు ఒకే పరిసరాల్లో ఉన్నాయి. ఇక వారి మధ్య ఉండే సంబంధం వల్లే చిన్నారి అతనిపై నమ్మకం పెట్టుకుంది. కానీ ఆ నిందితుడు బాలికను మాయమాటలతో బయటకు తీసుకెళ్లి అమానుషంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణం గురించి చిన్నారి తల్లికి తెలిసిన వెంటనే ఆమె ఆవేశంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీనిపై సిటీ కోత్వాలీ పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వయసు 18 సంవత్సరాల లోపే ఉండటంతో అతన్ని బాల న్యాయస్థానంలో హాజరుపరిచి, అనంతరం బాల సుధార గృహానికి తరలించారు.
హృదయవిదారకం.. 17కు చేరిన మృతుల సంఖ్య.. మృతుల్లో 8 మంది చిన్నారులు
హైదరాబాద్‌లోని పాతబస్తీ మీర్‌చౌక్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం మరింత విషాదాన్ని నింపింది. సహాయక చర్యలు కొనసాగుతుండగా, ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరుకుంది. మృతుల్లో ఎనిమిది మంది చిన్న పిల్లలు ఉండటం హృదయాలను కలిచివేస్తోంది. మృతి చెందిన చిన్నారుల్లో ఒకటిన్నర సంవత్సరం వయస్సున్న ఒకరు, ఏడేళ్ల వయస్సున్న మరొకరు ఉన్నారు. మిగిలిన ఆరుగురు పిల్లలు నాలుగు సంవత్సరాల లోపు వారే కావడం ఈ దుర్ఘటన తీవ్రతను తెలియజేస్తోంది. అంతేకాకుండా, ఈ ప్రమాదంలో నలుగురు వృద్ధులు (60 నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్సు ) , ఐదుగురు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఒకేసారి అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.
మీర్ చౌక్ అగ్నిప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి..
హైదరాబాద్ లో రోజుల వ్యవధిలోనే ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల పాత బస్తీలోని ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోగా అందులోని నివాసితులు ప్రాణాలతో బయటపడ్డారు. నేడు మీర్ చౌక్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించినప్పటికీ ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. అగ్నిప్రమాదంలో పలువురు దుర్మరణం పాలవడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మీర్ చౌక్ అగ్నిప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా
హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని మీర్ చౌక్‌లో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్కరికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రధాన్ మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకోగా, మంటల ప్రభావంతో మూడుగురు ఘటనాస్థలిలోనే మృతి చెందారు.
హైదరాబాదులో పేలుళ్లకు ప్లాన్.. ఐసీస్ మోడల్ ఆపరేషన్ ని భగ్నం చేసిన పోలీసులు
హైదరాబాద్ నగరంలో పేలుళ్లకు ప్లాన్ చేశారు కొందరు వ్యక్తులు. పసిగట్టిన ఆంధ్ర, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పేలుళ్లకు ప్లాన్ చేసిన వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఐసీస్ మోడల్ ఆపరేషన్ ని భగ్నం చేశారు. విజయనగరంకు చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్ ను అరెస్టు చేశారు. సిరాజ్ విజయనగరం లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడు. శిరాజ్, సమీర్ కలిసి నగరంలో డమ్మీ బ్లాస్ట్ కు ప్లాన్ చేశారు. సౌదీ అరేబియా నుంచి శిరాజ్, సమీర్ కు ఐ సిస్ మాడ్యుల్ అదేశాలు ఇచ్చింది. తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ తో పాటు ఆంధ్ర ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నిర్వహించి వారి కుట్రను భగ్నం చేశాయి.